Jaish-e-Mohammad (JeM): పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ తన వర్కింగ్ స్టైల్‌ను మార్చుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా జైష్ మహిళా ఉగ్రవాదుల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. జైష్ చీప్ మసూద్ అజార్ సోదరి సయీదా నేతృత్వంలో జమాత్-ఉల్-మొమినాత్ అనే మహిళా ఉగ్రవాదం సంస్థను ఏర్పాటైంది. మహిళల్ని రిక్రూట్ చేసుకోవడం ద్వారా తమ దాడుల్ని విస్తరించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 5000 మంది మహిళల్ని రిక్రూట్ చేసుకున్నట్లు, ఆత్మాహుతి కోసం వారికి శిక్షణ ఇస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ చెబుతోంది. మసూద్ అజార్ సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించాడు.
Read Also: Ravi Shastri: కోహ్లీ, రోహిత్లను ఇబ్బంది పెట్టే వారికి రవిశాస్త్రి వార్నింగ్.. టార్గెట్ గంభీరేనా?
ఇటీవల, 5000 మందికి పైగా మహిళలు ఉగ్రవాద సంస్థలో చేరారని, నియామకం, శిక్షణ సులభతరం చేయడానికి పీఓకే అంతటా జిల్లా స్థాయిలో సంస్థల్ని ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ప్రతీ జిల్లాకు ఒక మహిళా అధిపతి లేదా ముంతాజియా నేతృత్వంలో ఒక ప్రత్యేక ఆఫీస్ ఉంటుందని, ఇది మహిళా వింగ్ కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది.
అక్టోబర్ నెలలో, కొన్ని నివేదికల ప్రకారం ‘‘జైషే శత్రువులను’’ ఎదుర్కోవడానికి మహిళల్ని రిక్రూట్ చేసుకోవడం, వారికి శిక్షణ ఇవ్వడం వంటి ప్రణాళికల్ని వెల్లడించింది. మసూద్ అజార్ మహిళలకు బ్రెయిన్ వాష్ చేస్తూ.. వారు మరణించిన తర్వాత నేరుగా స్వర్గానికి వెళ్తారని చెబుతున్న ఆడియో ప్రసంగం వెలుగులోకి వచ్చింది. జైషే శత్రువులు (భారత సైన్యం) హిందూ మహిళల్ని సైన్యంలోకి తీసుకుంటున్నారని, మనకు వ్యతిరేకంగా మహిళా జర్నలిస్టులను ఏర్పాటు చేశారని తన ప్రసంగంలో చెప్పాడు.
