Site icon NTV Telugu

Jeevan Reddy : జై బాపు, జై భీమ్ సభలో ఆరోపణల మోత.. ఎమ్మెల్యే సంజయ్‌పై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Jeevan Reddy

Jeevan Reddy

Jeevan Reddy : జిల్లా కేంద్రంలో నిర్వహించిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” సభలో రాజకీయ వేడి పెరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మడిగే సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ముసుగులో వచ్చిన వాళ్ల కంటే మనం గట్టిగానే ఉన్నాం. భయపడాల్సిన అవసరం లేదు. ఎవడో వచ్చి కాళ్లల్లో కట్టే అడ్డం పెడితే ఎవరూ భయపడొద్దు. వాళ్ల కట్టే కంటే మన కాళ్లు బలంగా ఉన్నాయి,” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ముఖ్యంగా అభివృద్ధి అంశాన్ని ప్రస్తావిస్తూ జీవన్ రెడ్డి, “నాకు అభివృద్ధి చేయలేనంటారా? నేను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో అభివృద్ధిలో పోటీ పడ్డా. నువ్వు మాత్రం నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధిని కూడా చూపించలేకపోయావు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేసి ఉంటే, ఇవాళ ఈ లోపాలు కనిపించేవి కావు,” అంటూ సంజయ్‌ను నిలదీశారు.

“గత పదేళ్లలో టీఆర్ఎస్ అరాచక పాలనను ఎదుర్కొని, చెమటోడ్చి నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్కువగా చూడొద్దు. నీ స్వార్థ ప్రయోజనాలకు అభివృద్ధి పేర్లు పెట్టకూ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమే ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది,” అంటూ ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌పై మరోసారి విమర్శలు చేస్తూ, “నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు వేసుకుని అభివృద్ధి చేస్తానంటావా? ప్రజలు అంత మూర్ఖులు కాదు,” అని వ్యాఖ్యానించారు.

Health Tips: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే చాలు.. ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు

Exit mobile version