Site icon NTV Telugu

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా.. రేవంత్‌రెడ్డి మీద పోరాటం చేస్తానంటూ శపథం..

Jivan Reddy

Jivan Reddy

Jeevan Reddy: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాలుగు పేజీల రాజీనామా లేఖను కార్యకర్తల సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మీద పోరాటం చేస్తానంటూ శపథం చేశారు. తనను నమ్ముకున్న అనుచరులకి పదవులు రాకపోతే పార్టీలో కొనసాగడం అవసరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ న్యాయవాదులా నియామకంలోనూ తాను న్యాయవాదిని అయినా పట్టించుకోలేదన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలని హింసించి కొట్టించినవారిని గద్దేనెక్కిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మాది అన్న ఫీలింగ్ మావారికి లేదని.. గాంధీభవన్‌లో ఫిరాయింపుల ఎమ్మెల్యే ఉంటే సమావేశంలో ఎలా పాల్గొంటారన్నారు. రాహుల్ గాంధీ ఫాంచ్ న్యాయ్ అని రాజ్యంగం పట్టుకొని తిరుగుతే ఇక్కడ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నారన్నారు.

READ MORE: Telangana High Court: ఆ ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు..

“ఈ వయస్సులో నేను పార్టీ మారి ఎం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో తలదూర్చితే నేను ఎలా భరిస్తాను. నేను ఇరవై మాసాలు ఓపిక పట్టాను. కాంగ్రెస్ పార్టీలో నన్ను అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చారు. మీనాక్షి నటరాజన్ ఎనభై శాతం సీట్లు నాకే ఇస్తామని మాట ఇచ్చారు.. ఆ మాట పట్టించుకోలేదు. నాకు టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎలా చెబుతాడు. పదవులు కావాలనుకుంటే నేను బీఆర్ఎస్‌లోకి వెళ్లేవాడిని. పీసీసీ అధ్యక్షుడు కావాల్సి నోడిని నా హక్కుల కొసం పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. జీవన్ రెడ్డి అణగదొక్కాలన్నదే మీ ఆలోచన. చంద్రబాబు, కేసీఆర్‌ల మీద పోరాటం చేశాను.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి మీద పోరాటం చేస్తాను. అడుగులకి మడగులు ఒత్తేటోళ్ళే మీకు కావాలా? రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వాణ్ని అణగదొక్కారు. బతకవచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం సపహాదారుడా? పోచారం ఇప్పటివరకి ఏం‌ సలహాలు ఇచ్చాడు?” అని సీనియర్ నేత జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version