Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా.. రేవంత్‌రెడ్డి మీద పోరాటం చేస్తానంటూ శపథం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeevan Reddy: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాలుగు పేజీల రాజీనామా లేఖను కార్యకర్తల సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మీద పోరాటం చేస్తానంటూ శపథం చేశారు. తనను నమ్ముకున్న అనుచరులకి పదవులు రాకపోతే పార్టీలో కొనసాగడం అవసరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ న్యాయవాదులా నియామకంలోనూ తాను న్యాయవాదిని అయినా పట్టించుకోలేదన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలని హింసించి కొట్టించినవారిని గద్దేనెక్కిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మాది అన్న ఫీలింగ్ మావారికి లేదని.. గాంధీభవన్‌లో ఫిరాయింపుల ఎమ్మెల్యే ఉంటే సమావేశంలో ఎలా పాల్గొంటారన్నారు. రాహుల్ గాంధీ ఫాంచ్ న్యాయ్ అని రాజ్యంగం పట్టుకొని తిరుగుతే ఇక్కడ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నారన్నారు.
READ MORE: Telangana High Court: ఆ ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు..
Also Read
- Benjamin Netanyahu: ప్రపంచం వ్యతిరేకించినా భారత్ మాత్రం ఇజ్రాయెల్‌తోనే
- India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
- Twisha Sharmas: ట్విషా శర్మ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. మృతికి ముందు రూ.20 లక్షల షేర్లపై షాకింగ్ న్యూస్
- RR Vs GT Qualifier 2: టాస్ గెలవొద్దని కోరుకుంటున్న ఆర్ఆర్(RR), జీటీ(GT) టీమ్స్.. కారణం ఏంటో తెలుసా..?
“ఈ వయస్సులో నేను పార్టీ మారి ఎం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో తలదూర్చితే నేను ఎలా భరిస్తాను. నేను ఇరవై మాసాలు ఓపిక పట్టాను. కాంగ్రెస్ పార్టీలో నన్ను అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చారు. మీనాక్షి నటరాజన్ ఎనభై శాతం సీట్లు నాకే ఇస్తామని మాట ఇచ్చారు.. ఆ మాట పట్టించుకోలేదు. నాకు టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎలా చెబుతాడు. పదవులు కావాలనుకుంటే నేను బీఆర్ఎస్‌లోకి వెళ్లేవాడిని. పీసీసీ అధ్యక్షుడు కావాల్సి నోడిని నా హక్కుల కొసం పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. జీవన్ రెడ్డి అణగదొక్కాలన్నదే మీ ఆలోచన. చంద్రబాబు, కేసీఆర్‌ల మీద పోరాటం చేశాను.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి మీద పోరాటం చేస్తాను. అడుగులకి మడగులు ఒత్తేటోళ్ళే మీకు కావాలా? రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వాణ్ని అణగదొక్కారు. బతకవచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం సపహాదారుడా? పోచారం ఇప్పటివరకి ఏం సలహాలు ఇచ్చాడు?” అని సీనియర్ నేత జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది: బి.వి.ఎస్.రవి
-
Benjamin Netanyahu: ప్రపంచం వ్యతిరేకించినా భారత్ మాత్రం ఇజ్రాయెల్‌తోనే
-
India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
-
Twisha Sharmas: ట్విషా శర్మ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. మృతికి ముందు రూ.20 లక్షల షేర్లపై షాకింగ్ న్యూస్
-
BVS Ravi: బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీక్రెట్ బయటపెట్టిన బి.వి.ఎస్. రవి! అసలు విషయం ఇదే..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!