NTV Telugu Site icon

MLC Jeevan Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ 4000 రూపాయలు ఇస్తాం

Jeevan Reddy

Jeevan Reddy

కరీంనగర్ జిల్లా గంగధర మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోయిన సంవత్సరము అసెంబ్లీ సాక్షిగా 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన కేటీఆర్ ఇప్పటివరకు 8000 ఉద్యోగాలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గంలో ఎటు చూసినా కాలువలే కానీ పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేకపోతున్నారని, కొడిమ్యాల పోతారం చెరువును పూర్తి చేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు 35000 మాత్రమే రుణమాఫీ అయినాయని ఆయన మండిపడ్డారు. దళితులకు దళిత బందు ఇస్తానని చెప్పి అరిగిపోయిన రికార్డు మళ్లీ వేసినట్లు ఇప్పటికి 17 వేల కోట్లు కేటాయించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read : Harish Rao: తెలంగాణపై ఫేక్ ప్రేమ ప్రతిపక్షాలది.. ఫెవికల్ ప్రేమ కేసీఆర్ ది

సీఎం కేసీఆర్ దళితులతో పాటు అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమేనని వరంగల్ సభలో స్వయంగా ప్రధానమంత్రి మోడీ చెప్పారని గుర్తు చేశారు జీవన్ రెడ్డి. రాష్ర్ట ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నా సీఎం కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కేంద్రాన్ని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. చర్యలు తీసుకోకపోవడం అంటే ప్రత్యక్షంగా ప్రభుత్వ తీరును ప్రోత్సహిస్తున్నట్లే అని చెప్పారు. దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మైత్రి బంధానికి ఇంతకంటే ఏం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో యువత ప్రధాన పాత్ర పోషించబోతుందని జీవన్ రెడ్డి చెప్పారు.

Also Read : Blood & Chocolate: లెజండరీ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ ఆడియో రిలీజ్

Show comments