Site icon NTV Telugu

Jeevan Reddy: కాపలా కుక్కగా ఉంటానన్నోడు.. కుటుంబం మొత్తానికి పదవులిచ్చుకున్నడు

Jeevan Reddy: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కోరారు. సిరిసిల్ల జిల్లాలో హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవన్‌ రెడ్డి పలు వార్డుల్లో పాదయాత్ర నిర్వహించి బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విదానాలపై ముద్రించిన కరపత్రాలను అందిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రగతిని వివరిస్తూ ఆదరించాలని కోరారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ వస్తే కాపలా కుక్కగా ఉంటా అన్న కేసీఆర్… ఇప్పుడు కుటుంబం మొత్తానికి పదవులు ఇచ్చుకున్నారని ఆరోపించారు. అలాగే ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేశాడన్నారు. అప్పర్ మానేరు కి అన్యాయం చేసి తన భూములకు నీళ్ళిచ్చుకున్నాడంటూ జీవన్ రెడ్డి మండిపడ్డాడు.

Read Also: Maheshwar Reddy : మా మధ్య ఏం లేదు.. బాంబు పేల్చిన మహేశ్వరరెడ్డి

అలాగే, కాంగ్రెస్ హయాంలో కట్టిన టెక్స్ టైల్ పార్క్ తప్ప కేటీఆర్ సిరిసిల్లకు చేసిందేంటి? అని ప్రశ్నించారు. నేతన్నల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్సే అన్నారు. మహిళకు రుణాలు ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టారు.. ఆడబిడ్డల ఉసురు తలుగుతుంది అంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధర పెంపుపై నిరసన చేస్తున్న కేసీఆర్.. భారాన్ని తగ్గించాలని ఆలోచన ఎందుకు చేయడం లేదన్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.600 ఎక్కువ మద్దతు ధర ఇస్తుంది.. కేసీఆర్ నువ్ ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చావా?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధర కంటే 600 అధికంగా ఇస్తామని ప్రకటించారు. అలాగే ఎన్నికల హామీల్లో ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ లు.. దళిత బంధు పథకాలతో ప్రజలను మోసం చేశాడని జీవన్ రెడ్డి కేసీఆర్ పై ఆరోపణలు చేశారు.

Exit mobile version