Hyderabad: న్యూ ఇయర్ వేళ విషాదం.. బిర్యానీ తిని ఒకరు మృతి.. అపస్మారక స్థితిలో మరో 15 మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: జీడిమెట్లలో నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్‌లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాత్రి 17 మంది కలిసి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మద్యం సేవించి బిర్యానీ తిన్నారు. అనంతరం ఒక్కసారిగా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా, మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బాధితులను చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. మద్యం లేదా ఆహారంలో ఏదైనా కలుషితం కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
READ MORE: Naveen Chandra : భయానక ప్రపంచంలోకి తీసుకెళ్లిన నవీన్ చంద్ర ‘హనీ’ గ్లింప్స్
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
మరోవైపు.. హైదరాబాద్‌లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి ఒక్క రోజే రూ.350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషంగా మారింది. గత ఐదు రోజుల వ్యవధిలోనే రూ.1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే ఒక్క నెలలో రూ.5,000 కోట్లకు పైగా అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇది ఆల్‌టైం రికార్డ్‌గా పేర్కొంటున్నారు. సర్పంచ్ ఎన్నికల హడావుడి, న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గత ఐదు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం లభించింది. మద్యం అమ్మకాలు ఊహించని స్థాయిలో పెరగడంతో కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల లిక్కర్ సేల్స్ ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరాయని అధికారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!