Site icon NTV Telugu

JEE Main 2023: జేఈఈ మెయిన్ నోటిఫికేషన్‌ విడుదల

Jee Main 2023

Jee Main 2023

JEE Main 2023: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్ పరీక్ష 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2023 కోసం రిజిస్ట్రేషన్ డిసెంబర్ 15, 2022న ప్రారంభమవుతుంది. జనవరి 12, 2023న ముగుస్తుంది. అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్-బ్యాంకింగ్/యూపీఐ ద్వారా రుసుమును చెల్లించవచ్చు. తొలి సెషన్‌ పరీక్షకు నేటి (డిసెంబర్‌ 15) నుంచి జనవరి 12 రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు జనవరి 12 రాత్రి 11.50 నిమిషాల వరకు గడువు విధించారు. ఏ సిటీలో పరీక్ష నిర్వహిస్తామనేది జనవరి రెండో వారంలో ప్రకటించనున్నారు. అడ్మిట్‌ కార్డులను జనవరి మూడో వారంలో ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Woman Marries Lord Vishnu : మహా విష్ణువును పెళ్లి చేసుకున్న మహిళ

జేఈఈ పరీక్ష జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీలలో నిర్వహించబడుతుంది. జేఈఈ మెయిన్‌ 13 భాషలలో అంటే ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం , మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూలలో నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. జనవరిలో తొలి విడత, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రెండో సెషన్‌ ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరుగుతుందని ఎన్‌టీఏ తెలిపింది. మొదటి సెషన్‌లో సెషన్ 1 మాత్రమే కనిపిస్తుంది. అభ్యర్థులు దానిని ఎంచుకోవచ్చు. తదుపరి సెషన్‌లో సెషన్ 2 కనిపిస్తుంది. అభ్యర్థులు ఆ సెషన్‌ను ఎంచుకోవచ్చు. సమాచార బులెటిన్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సెషన్ 2 కోసం అప్లికేషన్ విండో మళ్లీ తెరవబడుతుంది. పబ్లిక్ నోటీసు ద్వారా కూడా ప్రత్యేకంగా తెలియజేయబడుతుంది.

Exit mobile version