JD Laxminarayana: ప్రజలలో చైతన్యం రావాలి.. ఏపీకి ప్రత్యేక హోదా విషయం పోరాడాలి అని పిలుపునిచ్చారు జై భారత్ పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాణ.. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పాస్ కాకుండా చూడాలి.. బడ్జెట్‌ను స్తంభింపజేస్తే కేంద్రం ఆలోచిస్తుందన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధించేందుకు అనేక అవకాశాలు వచ్చాయి.. 2019 నుంచి ప్రతిసారీ రాష్ర్టానికి చెందిన ఉభయపార్టీలు.. ఎన్టీఏకు మద్దతు పలికారు. అడకముందే మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హాదాపై టీడీపీ, వైసీపీకి చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. ముగించిన హామీగా పేర్కొన్నారు. హోదా వద్దు ప్యాకేజీనే ముద్దు అని టీడీపీ, జనసేన నేతలు మాట్లాడారని దుయ్యబట్టారు.
ఇక, 22 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై సీఎం వైఎస్ జగన్ ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని విమర్శించారు లక్ష్మీనారాయణ.. 14వ పైనాన్స్ కమిషన్ ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పలేదన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే ఇవ్వొచ్చని కమిషన్ చెప్పిందని గుర్తుచేశారు. 12వ పైనాన్స్ కమిషన్ చెప్పిన ప్రాపిట్ పెట్రోలియం గుర్చి ఎందుకు మాట్లాడరు? అంటూ రాజకీయ నేతలను ప్రశ్నించారు. ప్రాపిట్ పెట్రోలియం అంశంకో లక్షకోట్ల రూపాయలు వస్తాయి. ప్రజలలో చైతన్యం రావాలి, ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, రాజధాని, చెన్నై కారిడార్, దుగరాజపట్నం పోర్టు.. ఈ విభజన హామీలు.. పది శాతం కూడా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో షాక్.. తోషఖానా కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష!
మరోవైపు.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నవారు ఆంధ్రా ద్రోహులు అంటూ మండిపడ్డారు విభజన హామీల సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్.. ఏపీ యువత గుర్తించాలి , భివిష్యత్ కోసం జరుగుతున్న ఉద్యమం ఇది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఏం అన్నారో గుర్తుంచుకొండి.. ఉత్తరభారత బీజేపీ విషకౌగిలి నుంచి పవన్ బయటపడాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలు ఉపాధి లేఖ.. యువత వలస వెళ్లిపోతున్నారు.. కానీ, మన నేతలు తెలుగుజాతి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టుపెడుతున్నారు. గుజరాత్ కు మాత్రమే జీరో పర్సెంట్ ట్యాక్స్ ఎందుకు, కేవలం గుజరాత్ కు మాత్రమే పనిచేస్తున్నారు.. రోడ్లు వేసి టోల్ తీస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చలసాని శ్రీనివాస్ .