JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రోడ్డుపై బైఠాయించారు తాడిపత్తి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి.. సీబీ రోడ్డులో బైఠాయించిన జేసీ.. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.. అయితే, జనవరి 1కి డివైడర్ల మధ్య విద్యుత్ స్తంభాలకు విద్యుత్తు దీపాలు అలంకరించే పనిలో పడిపోయారు మున్సిపల్ ఉద్యోగులు.. అడ్డుగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను తొలగించడానికి ప్రయత్నించారు.. కాగా, డివైడర్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాలకు వైసీపీ జెండా తొలగించవద్దని పోలీసులు చెప్పారు. దీంతో, విద్యుత్ దీపాల అలంకరన నిలిచిపోయింది.. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ సీబీ రోడ్డులో బైఠాయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇక, రంగంలోకి దిగిన అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరపింపజేశారు తాడిపత్తి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి.
Read Also: Ram Mandir: ఒంటిపై హిజాబ్, వీపుపై రాముడి ఫోటో.. అయోధ్యకు బయలు దేరిన ముస్లిం యువతులు
మరోవైపు.. తాడిపత్రిలో మరో సారి కరపత్రాల కలకలం సృష్టించాయి.. మీ ఆస్తుల చిట్టా ఇదే అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి కరపత్రాలు ముద్రించారు గుర్తుతెలియని వ్యక్తులు.. 2019 ఆఫిడివిట్, ఎమ్మెల్యే అయిన తరువాత పెరిగిన ఆస్తులంటూ కరపత్రాల వేసి.. సిటీలో పలు ప్రాంతాల్లో గోడలకు, విద్యుత్ స్తంభాలకు అంటించినట్టు తెలుస్తోంది.. వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూములు.. పాసుబుక్కు నెంబర్లతో సహా ఎన్ని ఎకరాలు ఉన్నాయనో ఆ కరపత్రాల్లో పొందుపరిచారు.. 2019కి ముందు ఆయన కుటుంబానికి మొత్తంగా 53 ఎకరాల భూమి ఉంటే.. ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్దారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల భూమి 189.8 ఎకరాలకు చేరిందని ఆ కరపత్రాల్లో రాసుకొచ్చారు.. దోచుకొనేవాడు వద్దు.. అభివృద్ధి చేసేవాడు ముద్దు అంటూ ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. అయితే, తాడిపత్రిలో ఆది నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ఫ్యామిలీగా వ్యవహారం నడుస్తోన్న విషయం విదితమే. ఇప్పుడు ఆ కరపత్రాలు ఎవరు ముద్రించారు అనే విషయం తెలియాల్సి ఉంది.