Site icon NTV Telugu

JC Prabhakar Reddy: మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా.. జేసీ సంచలన ప్రకటన

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల లోపు రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలలో వైసీపీ అధికారంలోకి రాగా.. తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే, మున్సిపల్‌ చైర్మన్ గా ఎన్నికైనప్పుడు నాలుగు సంవత్సరాలలో మున్సిపల్ కౌన్సిలర్లను సంవత్సరానికి ఒకరు చొప్పున మున్సిపల్ చైర్మన్ గా.. మరికొంతమంది కౌన్సిలర్లను, మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేస్తామని ప్రకటించారు. ఇక, 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారం కైవసం చేసుకోవడంతో తన మున్సిపల్ చైర్మన్ పదవికి నెల రోజుల్లోపు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. గత ఐదు సంవత్సరాల్లో తాడిపత్రిలో కుంటపడిన అభివృద్ధిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

Read Also: Hyderabad Metro: మెట్రో రైల్ లో సాంకేతిక లోపం.. తెరుచుకోని మెట్రో డోర్లు

Exit mobile version