JC Prabhakar Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాలంటీర్ల ప్రస్తావన లేకుండా సాగడం లేదు.. ఎన్నికల విధుల్లో, ప్రచారాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత.. మూకుమ్మడిగా వివిధ ప్రాంతాల్లో తమ పదవులకు రాజీనామా చేస్తూ వస్తున్నారు వాలంటీర్లు.. అయితే, వాలంటీర్స్ ఎవరూ రాజీనామా చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. మా ప్రభుత్వం (తెలుగుదేశం పార్టీ సర్కార్ ) మీకు అండగా ఉంటుందని వెల్లడించారు. మీ సహకారంతో తాడిపత్రి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేస్తాం అన్నారు. ఇక, గత ఐదు సంవత్సరాలలో తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. మంచి పరిపాలన అందించడానికి మీ సేవలు వినియోగించుకుంటామని స్పష్టం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
Read Also: Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ చీఫ్‌కు తప్పిన ముప్పు.. తృటిలో బయటపడ్డ నానా పటోలే
కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. వాలంటీచర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన విషయం విదితమే.. వాలంటీర్ల వ్యవస్థే లేదంట అనే వార్త బయటకు వచ్చింది.. వాలంటీర్ల వ్యవస్ఖను రద్దు చేస్తూ రహస్య జీవో ఏమైనా తెచ్చారా..? అని ప్రశ్నించిన ఆయన.. వాలంటీర్ల వ్యవస్థపై తొలి సంతకం అంటే.. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్ఖ లేనట్టేగా..? అని పేర్కొన్నారు. సీఎం జగన్ వాలంటీర్లను మోసం చేస్తున్నారు.. జగన్ ఎంత స్వార్ధపరుడో వాలంటీర్లు అర్ధం చేసుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. కానీ, మేం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం.. వారికి 10 వేల రూపాయల గౌరవ భృతిని కల్పిస్తాం అని చంద్రబాబు వెల్లడించారు. ఇక, వాలంటీర్లల్లో చదువుకున్న వారికి అద్భుతమైన ఉపాధి కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.. తప్పుడు పనులు చేసిన వాలంటీర్లు జైలుకు వెళ్లొద్దు.. రాష్ట్ర ప్రగతితో వాలంటీర్లు భాగస్వామి కావాలి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం విదితమే.