NTV Telugu Site icon

Jaydev Unadkat Bowling: నరాలు తెగే ఉత్కంఠ.. భయపెట్టిన జయదేవ్‌ ఉనాద్కట్‌! వీడియో వైరల్

Jaydev Unadkat Bowling

Jaydev Unadkat Bowling

Jaydev Unadkat Last Over Video: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్ జయదేవ్‌ ఉనాద్కట్‌ అందరినీ భయపెట్టాడు. పంజాబ్ విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరం కాగా.. ఉనాద్కట్‌ బౌలింగ్ సన్‌రైజర్స్‌ జట్టునే కాకుండా, అభిమానులను కూడా టెన్షన్ పెట్టింది. జయదేవ్‌ సిక్సులు ఇస్తూ, వైడ్‌లు వేస్తూ.. మ్యాచ్‌ను నరాలు తెగే ఉత్కంఠకు తీసుకెళ్లాడు. చివరకు ఈ మ్యాచ్‌లో విజయం హైదరాబాద్ జట్టును వరించింది. ఫలితంగా తాజా ఎడిషన్‌లో హైదరాబాద్‌ ఖాతాలో మూడో గెలుపు చేరింది.

పంజాబ్ కింగ్స్‌ విజయానికి ఆరు బంతుల్లో 29 పరుగులు కావాలి. జయదేవ్‌ ఉనాద్కట్‌కు చేతికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బంతిని ఇచ్చాడు. మొదటి బంతికే పంజాబ్‌ బ్యాటర్‌ అశుతోశ్‌ శర్మ సిక్సర్‌ బాదాడు. ఆ తర్వాత రెండు వైడ్‌లు పడ్డాయి. దాంతో సమీకరణం 5 బంతుల్లో 21 పరుగులుగా మారింది. ఫీల్డర్‌ సమద్ తప్పిదం కారణంగా మళ్లీ సిక్సర్‌ వెళ్లింది. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఫలితంగా గెలుపు సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులుగా మారింది.

Also Read: Nitish Reddy-Pat Cummins: నితీష్ రెడ్డి అద్భుతం.. ప్యాట్ కమిన్స్ ప్రశంసలు!

అశుతోశ్‌ శర్మ నాలుగో బంతికి రెండు పరుగులు బాదాడు. ఆ తర్వాత జయదేవ్‌ ఉనాద్కట్‌ వైడ్‌ బాల్ వేశాడు. ఐదవ బంతికి ఫీల్డర్‌ రాహుల్ త్రిపాఠి క్యాచ్‌ డ్రాప్‌ చేయడంతో అశుతోశ్‌ బతికిపోవడమే కాకుండా.. ఒక పరుగు వచ్చింది. ఇక పంజాబ్ విజయానికి ఒక్క బంతికి తొమ్మిది పరుగులు కావాలి. మళ్లీ వైడ్‌ బాల్స్‌ పడతాయేమోనన్న టెన్షన్ అందరిలో ఉంది. కానీ ఉనాద్కట్‌ అలా చేయలేదు. ఆఖరి బంతికి శశాంక్‌ సింగ్‌ సిక్స్‌ బాదడంతో ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫలితంగా రెండు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. మొత్తానికి బౌలర్‌, ఫీల్డర్‌ తప్పిదాలు ఉత్కంఠకు దారి తీశాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments