Jaydev Unadkat Bowling: నరాలు తెగే ఉత్కంఠ.. భయపెట్టిన జయదేవ్ ఉనాద్కట్! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaydev Unadkat Last Over Video: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ అందరినీ భయపెట్టాడు. పంజాబ్ విజయానికి చివరి ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా.. ఉనాద్కట్ బౌలింగ్ సన్‌రైజర్స్ జట్టునే కాకుండా, అభిమానులను కూడా టెన్షన్ పెట్టింది. జయదేవ్ సిక్సులు ఇస్తూ, వైడ్లు వేస్తూ.. మ్యాచ్‌ను నరాలు తెగే ఉత్కంఠకు తీసుకెళ్లాడు. చివరకు ఈ మ్యాచ్‌లో విజయం హైదరాబాద్ జట్టును వరించింది. ఫలితంగా తాజా ఎడిషన్‌లో హైదరాబాద్ ఖాతాలో మూడో గెలుపు చేరింది.
పంజాబ్ కింగ్స్ విజయానికి ఆరు బంతుల్లో 29 పరుగులు కావాలి. జయదేవ్ ఉనాద్కట్‌కు చేతికి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బంతిని ఇచ్చాడు. మొదటి బంతికే పంజాబ్ బ్యాటర్ అశుతోశ్ శర్మ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత రెండు వైడ్లు పడ్డాయి. దాంతో సమీకరణం 5 బంతుల్లో 21 పరుగులుగా మారింది. ఫీల్డర్ సమద్ తప్పిదం కారణంగా మళ్లీ సిక్సర్ వెళ్లింది. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఫలితంగా గెలుపు సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులుగా మారింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Nitish Reddy-Pat Cummins: నితీష్ రెడ్డి అద్భుతం.. ప్యాట్ కమిన్స్ ప్రశంసలు!
అశుతోశ్ శర్మ నాలుగో బంతికి రెండు పరుగులు బాదాడు. ఆ తర్వాత జయదేవ్ ఉనాద్కట్ వైడ్ బాల్ వేశాడు. ఐదవ బంతికి ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి క్యాచ్ డ్రాప్ చేయడంతో అశుతోశ్ బతికిపోవడమే కాకుండా.. ఒక పరుగు వచ్చింది. ఇక పంజాబ్ విజయానికి ఒక్క బంతికి తొమ్మిది పరుగులు కావాలి. మళ్లీ వైడ్ బాల్స్ పడతాయేమోనన్న టెన్షన్ అందరిలో ఉంది. కానీ ఉనాద్కట్ అలా చేయలేదు. ఆఖరి బంతికి శశాంక్ సింగ్ సిక్స్ బాదడంతో ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా రెండు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. మొత్తానికి బౌలర్, ఫీల్డర్ తప్పిదాలు ఉత్కంఠకు దారి తీశాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A Fantastic Finish 🔥
Plenty happened in this nail-biter of a finish where the two teams battled till the end🤜🤛
Relive 📽️ some of the drama from the final over ft. Jaydev Unadkat, Ashutosh Sharma & Shashank Singh 👌
Watch the match LIVE on @starsportsindia and @JioCinema… pic.twitter.com/NohAD2fdnI
— IndianPremierLeague (@IPL) April 9, 2024
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!