Jayashankar Bhupalpally: మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడిన ఎస్ఐ..సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగింపు
- తుపాకీతో బెదిరంచి అత్యాచారం చేసినట్లు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు
- మరో ముగ్గురిపై ఆత్యాచారానికి పాల్పడినట్లు తెలిపిన పోలీసులు
- ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తునట్లుగా ఐజీపీ ఏ. వీ. రంగనాథ్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ లోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై భవాని సేన్ రాసలీలలు బయటపడుతున్నాయి. పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై ఎస్సై భవాని సేన్ వరుసగా హత్యాచారం చేసినట్లు వార్తలు సంచలనంగా మారాయి. ఆమెను తుపాకీతో బెదిరంచి అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్.ఐ భవాని సేన్ ను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజీపీ ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్.ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణ చేపట్టారు. విచారణలో ఎస్. ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ అయ్యింది. దీంతోపాటు ఎస్.ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో ఇతనిపై ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తేలింది.
READ MORE: Minister Narayana: రాజధానిలో ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉంది..
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
సదరు ఎస్. ఐ తన హోదా అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. తరుచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవహారం తమ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉందని పోలీస్ శాఖ నిర్ణయించుకుంది. కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ పై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తునట్లుగా ఐజీపీ ఏ. వీ. రంగనాథ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!