Site icon NTV Telugu

Jaya Prada: ప్రముఖ నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం..

Jaya Prada

Jaya Prada

ప్రముఖ నటి, మాజీ రాజ్యసభ, లోక్ సభ సభ్యురాలు జయప్రద ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు (65) నిన్న (ఫిబ్రవరి 27) మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు. రాజబాబు నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.26 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

READ MORE: Preity Zinta: నాకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు కానీ.. పొలిటికల్ ఎంట్రీపై ప్రీతీ జింటా క్లారిటీ..

ఈ మేరకు జయప్రద సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘మా సోదరుడు రాజా బాబు మరణ వార్తను మీకు తెలియజేస్తున్నందుకు బాధగా ఉంది. ఆయన నిన్న మధ్యాహ్నం హైదరాబాద్​లో కన్నుమూశారు’ అని ఆమె పేర్కొన్నారు. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

READ MORE: Himachal: రాష్ట్ర పథకాలకు “దేవాలయాల” డబ్బులు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఆగ్రహం..

Exit mobile version