NTV Telugu Site icon

Jayamangala Venkata Ramana: సీఎం చంద్రబాబు కాళ్లు మొక్కిన జనసేన నేత..

Jayamangala

Jayamangala

Jayamangala Venkata Ramana: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. సీఎం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు పోలవరం చేరుకున్నారు. గంట ఆలస్యంగా వచ్చినా.. ఆయన దాదాపు నాలుగు గంటల పాటు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌లు సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ఇక, అనంతరం పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం అయ్యారు. నిర్వాసితులుతమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చాక నిర్వాసితుల ఖాతాల్లో 828 కోట్లు వేసామన్నారు. పది లక్షల చొప్పున పరిహారం ఇస్తానని చెప్పిన జగన్ అయిదేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదని,మళ్ళీ వస్తారు..ఏదో చేస్తామంటారు.. ఏమీ చేయరు.. వారికి అధికారం తప్పా మరొకటి పట్టదని మండపడ్డారు..

Read Also: CM Chandrababu: కాంట్రాక్టర్లకు సీఎం వార్నింగ్.. అలా జరిగితే బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం..!

ఇక, తన కాళ్లకు నమస్కరించిన జయమంగళ వెంకటరమణను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు సీఎం చంద్రబాబు.. కాగా, 1999లో టీడీపీ నుంచి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు జయమంగళ.. 2009 ఎన్నికల్లో కైకలూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. 2019లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే, 2023 ఫిబ్రవరిలో వైసీపీలో చేరి.. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు.. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నవంబర్ 23న వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మరో వైపు, తన పర్యటనలో పోలవరం ప్రాజెక్టు అప్పర్ కాపర్ డ్యాం పై నుంచి ప్రాజెక్టును పరిశీలించారు సీఎం చందరబాబు.. తర్వాత డయాఫ్రం వాల్ పనులను, వైబ్రో కంపాక్షన్ పనులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు క్యాంప్ సైట్ కు చేరుకున్న అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన , పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొమ్మిది నెలల్లో ప్రాజెక్టును గాడిలో పెట్టడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. సముద్రంలో కలుస్తున్న వరద నీటిలో కనీసం 400లేదా 500 టీఎంసీల నీరు వాడుకుంటే, రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారుతుందని చంద్రబాబు చెప్ఫారు. 2014నుంచి 2019 వరకు 73 శాతం పనులు చేసశామని, 2019 తరువాత ప్రాజెక్టును చూస్తే చాలా బాధ వేస్తుందన్నారు. తెలియనితనం, అహంభావం, వివక్షత వలన ప్రాజెక్టును నాశనం చేసారన్నారు. ఒకసారి ఓట్లు వేయడం వలన రాష్ట్రానికి జీవనాడి లేకుండా చేసారని వాపోయారు. దెబ్భతిన్న డయాఫ్రం పరిశీలనకు నిపుణుల కమిటీ వచ్చిందని,కొత్త డయాఫ్రం వాల్ కట్టాలని వారు సూచించారన్నారు .రివర్స్ టెండరింగ్ పేరుతో రాజకీయ కక్షతో డయాఫ్రం వాల్ ను పట్టించుకోలేదని, డయాఫ్రం వాల్ పని ఈ ఏడాది డిసెంబర్ నాటికి మేము పూర్తి చేస్తామన్నారు. మిగిలిన పనులన్ని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, 2027 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలుతీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు.