NTV Telugu Site icon

Jayamangala Venkata Ramana: సీఎం జగన్‌ తో జయమంగళ వెంకటరమణ భేటీ

Jayamangala Venkataramana Joined Ysrcp Jpg

Jayamangala Venkataramana Joined Ysrcp Jpg

ఎన్నికల సమయం వచ్చేస్తోంది. వివిధ పార్టీల నుంచి వలసల ప్రస్థానం ప్రారంభం అయింది. సీఎం జగన్మోహన్ రెడ్డితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకట రమణ భేటీ అయ్యారు. జయమంగళను వెంట పెట్టుకుని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు జయమంగళ. జయమంగళకు వైసీపీ ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు జయ మంగళ వెంకటరమణ.

Read Also: సెనగపిండి ఎక్కువగా వాడుతున్నారా? అయితే, డయాబెటిస్ నుంచి మీకు రక్షణ లభిస్తున్నట్టే!

పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు జయ మంగళ. వడ్డెర సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తానని ఎన్నికల సందర్భంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. నాటి హామీ మేరకు జయమంగళకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తున్నారు. గత కొంతకాలంగా కైకలూరు రాజకీయాల్లో జయమంగళ వెంకటరమణ స్తబ్ధుగా ఉన్నారు. కార్యకర్తలతో భేటీ అనంతరం కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జయమంగళ వెంకటరమణ పార్టీ మారడంపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు.

వ్యక్తిగత లబ్ది కోసమే జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి వెళ్లారని ఆరోపించారు. కైకలూరులో టీడీపీ జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు సూచనతో మరో నాలుగు రోజుల్లో కైకలూరుకు కొత్త ఇన్చార్జిని ప్రకటించనుంది టీడీపీ. టీడీపీకి రాజీనామా చేయడానికి ముందే జయమంగళ మంత్రి కారుమూరితో కలిసి సీఎంతో భేటీ అయ్యారు. సీఎం నుంచి ఆయనకు ఎమ్మెల్సీపై హామీ లభించడంతో టీడీపీని వీడారు. సీఎంని కలిసిన వెంటనే ఆయనకు నలుగురు భద్రతా సిబ్బందిని కేటాయించడంతో పార్టీ మారుతున్న అంశం ఖాయమైంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో జయమంగళ అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also: Writer Padmabhushan: ఆ విజయం దీనికి రాసి పెట్టి ఉంది: నాని