NTV Telugu Site icon

Jayalalitha’s Assets: వామ్మో.. జయలలిత ఆభరణాల విలువ రూ.4వేల కోట్లు.. 1,672 ఎకరాల భూమి..

Jayalalitha

Jayalalitha

జయలలిత ఆస్తులు చెన్నై చేరుకున్నాయి. మాజీ సీఎం జయలలిత ఆస్తులను స్పెషల్ సీబీఐ కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించింది. నిన్నటి 12 అట్టపెట్టెల్లో భారీ భద్రత నడుమ బెంగుళూరు నుంచి చెన్నై తరలించారు. మొత్తం నాలుగు వేల కోట్లు విలువ చేసే 27 కిలోల ఆభరణాలు.. 601 కిలోల వెండి ఉన్నట్లు అధికారులు తెలిపారు. పది వేలకుపైగా చీరలు, 750 జతల చెప్పుల జతల చెప్పులు ఉన్నాయి. 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, పలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలను తరలించారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని తమిళనాడు ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. వీటి విలువ వేల కోట్లు ఉంటుంది.

READ MORE: Mangli: అంతా విష ప్రచారం.. ‘బాబు’ని నేనేం అనలేదు.. ప్రమాణం చేసి చెబుతున్నా!

1991-96 మధ్య జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినందుకు అవినీతి నిరోధక పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తమిళనాడు అవినీతి నిరోధక శాఖ పోలీసులు జయలలిత ఇంటిపై దాడి చేసి బంగారం, వజ్రాల ఆభరణాలు, వెండి వస్తువులు, ఖరీదైన గడియారాలు వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ నగలు, వస్తువులన్నీ కర్ణాటక నుంచి తమిళనాడుకు తరలించారు.

READ MORE: AP Crime: వీడు భర్తేనా..? న్యూడ్‌ కాల్స్‌ చేసి డబ్బు సంపాదించు.. భార్యకు వేధింపులు..!