Site icon NTV Telugu

Srinivasa Mangapuram : జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’లో స్పెషల్ రోల్ సర్‌ప్రైజ్!

Ayakrishna Ghattamaneni

Ayakrishna Ghattamaneni

టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఎక్స్ 100’ వంటి కల్ట్ హిట్ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ సమర్పిస్తుండగా, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తికాగా, తిరుపత దాని పరిసర ప్రాంతాల్లోని హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో ఈ కథ సాగనుంది.

Also Read : Valentine’s Day Releases : వాలెంటైన్స్ డే రేస్‌లో మూడు సినిమాలు.. గెలిచిందెవరు?

విష్ణువు స్వయంభువుగా వెలిసిన ఈ క్షేత్రంలో జరిగిన ఒక యదార్థ గాథ ఆధారంగా ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీని అజయ్ భూపతి మలుస్తున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. చిత్ర క్లైమాక్స్‌లో వచ్చే ఒక అత్యంత కీలకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ ఒక సీనియర్ హీరోయిన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. సినిమా మలుపు తిప్పే ఈ స్పెషల్ రోల్ కోసం ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కుమార్తె రషా తదాని ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఘట్టమనేని వారసుడి తొలి సినిమా కావడంతో మే 31న (కృష్ణ జయంతి సందర్భంగా) ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version