Site icon NTV Telugu

Srinivasa Mangapuram: జయకృష్ణ ఎంట్రీ అదుర్స్.. మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

Jaya Krishna Ramesh Babu Son, Srinivasa Mangapuram Teaser

Jaya Krishna Ramesh Babu Son, Srinivasa Mangapuram Teaser

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విలక్షణమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, అశ్విని దత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మంచి అంచనాలను పెంచగా.. తాజాగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి జయకృష్ణకు ఆశీస్సులు అందించారు.

Also Read: Mrunal Thakur: నాని, దుల్కర్ నా బిగ్గెస్ట్ చీర్ లీడర్స్.. వారి సపోర్ట్ మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

కాగా టీజర్ పరిశీలిస్తే తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ప్యూర్ లవ్ స్టోరీగా ఈ సినిమాను దర్శకుడు మలిచారు. వాసు బాబు (జయకృష్ణ), మంగా (రాషా తడానీ) అనే ఇద్దరు స్నేహితుల మధ్య చిగురించిన ప్రేమ, వారి జీవితంలో ఎదురైన ఊహించని మలుపులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. జయకృష్ణ తన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ గ్లామర్ అదనపు క్రేజ్ పెంచింది. ఈ సినిమాలో మరో బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపిస్తుండటం. టీజర్‌లో ఆయన కనిపించిన తీరు కథపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓవరల్ గా ట్రెండీ రొమాన్స్ ఇంటెన్స్ యాక్షన్ కలగలిపి అజయ్ భూపతి ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. దీంతొ ఘట్టమనేని వారసుడికి ఈ సినిమా ఒక సాలిడ్ డెబ్యూ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

 

Exit mobile version