NTV Telugu Site icon

Amitabh Wife Shocking Comments: పెళ్లి కాకుండానే పిల్లలను కనొచ్చు.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమితాబ్ వైఫ్

Jaya Bachan

Jaya Bachan

Amitabh Wife Shocking Comments: బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమైయ్యాయి. తన మనవరాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కూతురు శ్వేతా బచ్చన్ నందా కుమార్తె నవ్య నవేలి నందా పెళ్లి కాకుండానే పిల్లలను కంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అంతేకాకుండా ఎలాంటి రిలేషన్ షిప్ అయినా కొనసాగించాలంటే శారీరక ఆకర్షణ తప్పనిసరి అని అన్నారు. ఆమె మనవరాలు నవ్య నవేలి నందతో కలిసి ‘వాట్ ది హెల్ నవ్య’ అనే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. నవ్య నవేలి నందకు పెళ్లి కాకుండా బిడ్డకు జన్మనిచ్చినా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పింది. ప్రజలు నా నుండి ఇలాంటి కామెంట్లు రావడాన్ని అభ్యంతరకరంగా భావిస్తారు.. కానీ శారీరక ఆకర్షణ చాలా ముఖ్యమైనదని అన్నారు జయ. మా కాలంలో మేము ప్రయోగాలు చేయలేకపోయాము.. కానీ నేటి తరం వారు ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నించారు.

Read Also: Rishi Sunak key Decision: రిషి సునాక్ తీసుకున్న నిర్ణయంతో ఆందోళన చెందుతున్న పలుదేశాలు

శారీరక సంబంధం లేకుంటే ప్రేమ-బంధం అనేవి చాలా కాలం కొనసాగవు. అడ్జెస్ట్మెంట్స్ చేసుకుంటూనే జీవితాంతం బతకలేరని నేను భావిస్తున్నానని అన్నారు జయ బచ్చన్. ఇప్పటి జెనరేషన్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ను పెళ్లి చేసుకుంటే చాలా బెటర్ అని కూడా జయ బచ్చన్ సలహాలు ఇచ్చారు. బెస్ట్ ఫ్రెండ్ తో బిడ్డను కనడంలో కూడా తప్పులేదని అన్నారు. ఈ జెనరేషన్ పిల్లలు మీ బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదని జయ అన్నారు. జయ తన అభిప్రాయాన్ని నవ్యతోనూ, ఆమె కుమార్తె శ్వేతా బచ్చన్‌తో కూడా పంచుకున్నారు.

Read Also: Raj Tarun: నీ అంతు చూస్తా.. మీకు ఆ అమ్మాయి కనపడితే చెప్పమంటున్న రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

జయ బచ్చన్ అమితాబ్ బచ్చన్‌ ను 1973లో వివాహం చేసుకుంది. కుమార్తె శ్వేత (1974), కొడుకు అభిషేక్ బచ్చన్ (1976) జన్మించారు. ఇక కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో జయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలియా భట్, ధర్మేంద్ర, షబానా అజ్మీ కూడా నటించారు. ఈ సినిమా 2023లో విడుదల కానుంది.