NTV Telugu Site icon

Pink Ball Test: అందుకే డే/నైట్ టెస్టులు భారత్‌లో నిర్వహిచడం లేదు: జై షా

Jay Shah

Jay Shah

ఇటీవలి కాలంలో ప్రతి సిరీస్‌లో ఒక్క డే/నైట్ టెస్టు (పింక్‌ టెస్టు) అయినా ఏర్పాటు చేయడం సాధారణమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో ఎక్కువగా పింక్‌ బాల్ టెస్టులు జరుగుతున్నాయి. భారత్‌ వేదికగా జరిగే సిరీసుల్లో మాత్రం పింక్‌ టెస్టు ఆడటం లేదు. చివరిసారిగా 2022లో శ్రీలంకతో భారత్ తలపడింది. ప్రపంచంలోనే ధనిక బోర్డు అయిన బీసీసీఐ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచులే జరిగాయంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. భారత్‌లో పింక్‌ టెస్టులు ఎందుకు నిర్వహించడం లేదో బీసీసీఐ కార్యదర్శి జై షా సమాధానం ఇచ్చారు.

వచ్చే నెలలో భారత్‌ పర్యటనకు బాంగ్లాదేశ్ రానుంది. ఈ రెండు పర్యటనలో టెస్టులు, మూడు టీ20లు జరగనున్నాయి. తాజాగా జై షా మాట్లాడుతూ… ‘భారత్‌లో పింక్‌ టెస్టులు ఆడకూడదనే నిబంధనలు లేవు. మన స్టేడియాల్లో డే/నైట్ మ్యాచ్‌లు ఆడితే రెండు రోజుల్లోనే ఫలితం వస్తుంది. దాంతో అభిమానులు, బ్రాడ్‌కాస్టర్లు ఆర్థికంగా నష్టపోతారు. టెస్టు మ్యాచ్‌ కోసం ఫాన్స్ ఐదు రోజుల పాటు టికెట్‌ను కొనుగోలు చేస్తాడు. కేవలం 2-3 రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసిపోతే తీవ్ర నిరాశకు గురవుతాడు. మిగతా రోజులకు రిఫండ్‌ ఉండదు’ అని అన్నారు.

Also Read: Duleep Trophy 2024: అందుకే కోహ్లీ, రోహిత్ ఆడటం లేదు: జై షా

త్వరలో ప్రారంభం కానున్న జాతీయ క్రికెట్ అకాడమీ కొత్త క్యాంపస్‌లో అథ్లెట్లకు సైతం సేవలు అందిస్తామని జై షా చెప్పారు. ‘నీరజ్‌ చోప్రా వంటి ఒలింపిక్‌ అథ్లెట్లకూ మెరుగైన సేవలు అందించాలన్నదే మా లక్ష్యం. త్వరలోనే కొత్త ఎన్‌సీఏను ప్రారంభిస్తాం. ఇందులో మూడు ప్రపంచస్థాయి మైదానాలు, 45 ప్రాక్టీస్‌ పిచ్‌లు, ఇండోర్ క్రికెట్‌ పిచ్‌లు, ఒలింపిక్‌ సైజ్ స్విమ్మింగ్‌ ఫూల్ తదితర సదుపాయాలు ఉన్నాయి. మౌలిక వసతులు అందరు క్రీడాకారులకు ఉపయోగపడతాయి’ అని చెప్పుకొచ్చారు.