Jawan OTT: సరి కొత్త సీన్స్ తో ఓటీటీ రిలీజ్ చేయనున్న మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతుంది.ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా విడుదల అయిన 10 రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 797.50 కోట్ల వసూళ్లు వచ్చినట్లు జవాన్ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాకు సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు.అలాగే ఈ సినిమాలో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే దీపికా పదుకొనే, ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ మరియు యోగిబాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించారు.. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ జవాన్ ను నిర్మించారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు..
థియేటర్లలో అదరగొడుతున్న జవాన్ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ అట్లీ స్పందించారు. షారుక్ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ ను అందించారు అట్లీ . ‘సరైన రన్ టైమ్, ఎమోషనల్ సీన్లతో జవాన్ ను థియేటర్లలో మేము విడుదల చేశాం. అయితే ఓటీటీ రిలీజ్‌కు వచ్చే సరికి ఇంకొన్ని సీన్లు కూడా యాడ్ చేయాలనుకుంటున్నాం. అందుకే హాలీడేకు వెళ్లకుండా ఇప్పుడు దీనిపైనే నేను వర్క్ చేస్తున్నాను. ఓటీటీలో ప్రేక్షకులని జవాన్ సినిమా కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది.’అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ అట్లీ. అయితే జవాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడనే దానిపై మాత్రం ఆయన స్పందించలేదు.షారుక్ జవాన్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ. 250 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుంది… దీపావళి కానుకగా ఈ సినిమా ను నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేసే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తుంది
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Tags
- Atlee
- jawan
- OTT
- Sharukh Khan
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!