Jasprit Bumrah: భారతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా గాయంతో ఐపీఎల్ 2025 ప్రారంభంలో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులో ఉండడంలేదని ఆ జట్టు కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేసే బుమ్రా లేని లోటును ముంబయి ఇండియన్స్ ఎలా తట్టుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జస్ప్రీత్ బుమ్రా టీమిండియా బౌలింగ్ విభాగానికి వెన్నెముక. అతడు తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన బుమ్రా, తక్కువ సమయంలోనే భారత బౌలింగ్ దళానికి కీలక ఆటగాడిగా మారాడు. అతని స్పీడ్, యార్కర్లు, డెత్ ఓవర్లలో అద్భుతమైన నియంత్రణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచాడు. కానీ, గాయాలు అతడి కెరీర్‌ను పలుమార్లు ప్రభావితం చేశాయి.
Also Read: Indian Railways: రెండేళ్లలో రైళ్లపై దాడులు.. 7,971 కేసులు.. రూ.5.79 కోట్ల నష్టం
ఈ ఏడాది మొదట్లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన బుమ్రా, ఆ గాయం కారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పాల్గొనలేకపోయాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో కూడా అతడు ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్ 2025 ప్రారంభంలో కనీసం మూడు మ్యాచ్‌లకు అతడు దూరం అయ్యే అవకాశం కనపడుతుంది. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ధృవీకరించాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన బుమ్రా.. ఇప్పుడు టీమ్‌కు అందుబాటులో లేకపోవడం మాకు ఓ పెద్ద సవాలేనాని పేర్కొన్నారు. కానీ, ఈ అవకాశాన్ని మా జట్టులోని మరో బౌలర్ అందిపుచ్చుకోవాలని, ఈ లోటును భర్తీ చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే టోర్నమెంట్ ఆరంభంలోనే తీసుకోవాలని ఆయన అన్నారు.
Also Read: Anurag Kashyap : నెట్ ఫ్లిక్స్ లో ఉన్న వాళ్లు అవినీతిపరులు.. స్టార్ డైరెక్టర్ సంచలనం
ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 2025లో తమ మొదటి మ్యాచ్‌ను మార్చి 23న చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. బుమ్రా లేని లోటును ముంబయి ఇండియన్స్ ఎలా భర్తీ చేస్తుందనేది అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులు అతడు త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నారు.