Site icon NTV Telugu

Jasprit Bumrah: ప్రేమతో స్పెష‌ల్‌ బ‌ర్త్‌డే విషెస్‌ చెప్పిన బుమ్రా.. ట్వీట్ వైర‌ల్..

Bumrah Jusprith

Bumrah Jusprith

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజనా గణేశన్‌కు ‘ఎక్స్’ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. “నీతో జీవితాన్ని పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. నువ్వే నా ప్రపంచం. నేనూ, కొడుకు అంగద్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. బర్త్ డే పార్టీలోని బుమ్రా, తన భార్య ఉన్న ఫోటోను జోడించాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.

Also Read: Aa Okkati Adakku : మూడో రోజు మరింత ఎక్కువగా.. ఫన్ బ్లాక్ బస్టర్ గా అల్లరోడి సినిమా..

ఇదిలా ఉంటే.. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అయిన సంజన ఐపీఎల్ లాంటి టోర్నీలకు కూడా హోస్ట్ గా వ్యవహరించింది. 2014 ప్రారంభంలో, ఆమె మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. ఆ తర్వాత కొంతకాలం మోడల్‌గా పనిచేసిన ఆమె రియాలిటీ షో హోస్ట్‌ గా కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది.

Also Read: Shortage of beers: రాష్ట్రంలో బీర్ల కొరత.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మద్యం ప్రియులు

ఇది జరిగిన కొంత కాలానికి భారత జట్టు ఆటగాడు బుమ్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మార్చి 15, 2021న, జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్ వివాహం చేసుకున్నారు. ఈ జంట గతేడాది అంగద్ అనే కొడుకును స్వాగతించారు.

Exit mobile version