Site icon NTV Telugu

Jasprit Bumrah: లక్కీ ఫెలో.. తన ప‌ర్పుల్ క్యాప్ ను పిల్లాడికి ఇచ్చేసిన బుమ్రా..

Jasprit Bumrah

Jasprit Bumrah

టీమిండియా ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో తన పేస్‌ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణుకు పుట్టిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు ఈ సీజన్ లో 10 మ్యాచ్‌లు ఆడి 6.40 ఎకానమీ రేటుతో 14 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ గా ముందు స్థానంలో కొనసాగుతున్నాడు. దాంతో అతనికి ప్రస్తుతం పర్పుల్‌ క్యాప్ ఉంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం బుమ్రా చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో గమనించినట్లైతే..

Also Read: Sanju Samson: శ్ర‌మ‌, చెమ‌టతో కుట్టిన చొక్కా.. సంజు శాంసన్ ఎమోషనల్ పోస్ట్..

మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ లో ముంబై తొలి బ్యాటింగ్ చేయగా.. నెహాల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35 ) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యాన్ని లక్నో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాట్స్‌మెన్ మార్కస్ స్టోయినిస్ (62) అర్ధశతకం బాదాడు. ఈ మ్యాచ్‌ లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసుకోలేకపోయాడు. బుమ్రా మ్యాచ్ మొత్తం ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌ కి వెళ్తుండగా పక్కనే ఉన్న స్టాండ్స్‌ లో ఉన్న ఓ బాలుడికి తన పర్పుల్ క్యాప్ ఇవ్వడంతో ఆ పిల్లాడి ఆనందానికి అవుథులు లేకుండా పోయాయి.

Also Read: Bumper Offer: ఓట్లేయండి.. లక్కీడ్రాలో ల్యాప్‌టాప్‌లు, డైమండ్ రింగ్స్ గెలుచుకోండి..

అంతేకాదు అతనికి ఆటోగ్రాఫ్‌ చేయడంతో.. ఆ చిన్నారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఈ ఒక్క వీడియోతో బుమ్రాను క్రికెట్ అభిమానులు తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Exit mobile version