NTV Telugu Site icon

AUS vs IND: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. కెప్టెన్ బుమ్రా ఓటు ఆ ఇద్దరికే! తుది జట్టు ఇదే

Indiat Test Team

Indiat Test Team

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా, భారత్ టీమ్స్ పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ఆడనున్నాయి. కుమారుడి పుట్టిన కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టును నడిపించనున్నాడు. మొదటి టెస్టులో ఆడే తుది జట్టుపై బుమ్రా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాడని తెలుస్తోంది.

రోహిత్ శర్మ జట్టుకు అందుబాటులో లేకపోవడంతో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్‌ రాహుల్ ఓపెనర్‌గా ఆడనున్నాడని తెలుస్తోంది. దాంతో అభిమన్యు ఈశ్వరన్‌కు నిరాశ తప్పదు. వన్‌ డౌన్‌లో గిల్‌ స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్ ఆడనున్నాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఆడతాడు. రిషబ్ పంత్ ఐదులో ఆడనుండగా.. ధ్రువ్‌ జురెల్‌ను ఆరో స్థానంలో బరిలోకి దిగుతాడని ప్రచారం సాగుతోంది. తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి అరంగేట్రం దాదాపు ఖాయమే. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉండనున్నాడు. ఆస్ట్రేలియా-ఏతో పాటు ఇంట్రాస్క్వాడ్‌ వార్మప్‌ మ్యాచ్‌లో నితీశ్ మెరుగైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

విదేశాల్లో స్పిన్నర్‌ అనగానే బ్యాటింగ్‌ చేయగల రవీంద్ర జడేజా వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపేది. కానీ ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు కలిగిన ఆర్ అశ్విన్‌ను తీసుకోవావడానికి కెప్టెన్ బుమ్రా మొగ్గుచూపిస్తునట్లు తెలుస్తోంది. బౌన్సీ పిచ్‌లపై అశ్విన్‌ మరింత ప్రమాదకరం అనే ఉద్దేశంతో బుమ్రా ఉన్నాడట. ఇక పేస్ విభాగంలో తనతో పాటు ఆకాశ్‌ దీప్‌, మహ్మద్ సిరాజ్‌లను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట.

Also Read: Viral Video: ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా.. కిందపడి నవ్వుకున్న పంత్, కోహ్లీ!

తుది జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్‌ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ రెడ్డి, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్‌, ఆకాశ్ దీప్.