Site icon NTV Telugu

Jasprit Bumrah: ఎట్టకేలకు టెస్టు కెప్టెన్‌ ఎంపికపై మౌనం వీడిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఏమన్నాడంటే..?

Jasprit Bumrah

Jasprit Bumrah

Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా ఎంపిక కాకపోవడంపై చివరికి తన మౌనాన్ని వీడారు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తనను కెప్టెన్సీకి ఆలోచించినప్పటికీ, తన వర్క్‌ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఆ అవకాశాన్ని తిరస్కరించాల్సి వచ్చిందని అన్నారు. టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత శుభ్‌మన్ గిల్ కు కెప్టెన్సీ, రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.

Read Also: 4-Day Tests: నాలుగు రోజుల టెస్ట్‌లకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్..?

రోహిత్, విరాట్ రిటైరైన సమయం, ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే నేను బీసీసీఐని సంప్రదించాను. ఐదు టెస్ట్‌ల సిరీస్‌కి నా శరీర భారం ఎలా ఉంటుంది అనేది డాక్టర్లతో, సర్జన్స్ తో, నా ఫిజియోలాజికల్ టీమ్‌తో చర్చించాను. వాళ్లంతా నీవు చాలా తెలివిగా వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ చేయాలని ఒకే మాట చెప్పినట్లు తెలిపారు. దాంతో నేను బీసీసీఐకి కాల్ చేసి కెప్టెన్సీ భాద్యతలు తీసుకోనని చెప్పానని బుమ్రా వెల్లడించారు. నిజానికి బీసీసీఐ నన్ను లీడర్‌గా చూడాలనుకుంది.. అది నాకు గౌరవమే. కానీ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో మూడింట్లో ఒక కెప్టెన్, రెండింట్లో ఇంకొకరు ఉంటే అది జట్టుకే నష్టం. నేను ఎప్పుడూ జట్టు ప్రయోజనాన్ని ముందుగా చూసే వ్యక్తిని. అందుకే తప్పుకున్నా అంటూ బుమ్రా పేర్కొన్నాడు.

Read Also: Parenting Advice: పాఠశాలలు ప్రారంభం.. ఈ అంశాల్లో మీ పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే అంతే సంగతులు?

గత కొద్దీ కాలంగా బుమ్రా గాయాల బాధతో తరచూ మ్యాచులకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు టెస్ట్‌ల పూర్తి సిరీస్ ఆడటం బుమ్రా శరీరానికి సవాలుగా మారే అవకాశం ఉండటంతో బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుని, ఆయనను అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంచకుండా ప్లాన్ చేసింది. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు జస్‌ప్రీత్ బుమ్రా తీసుకున్న ఈ సరైన నిర్ణయం ఆయన ప్రొఫెషనలిజం, జట్టు పట్ల నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తోంది.

Exit mobile version