NTV Telugu Site icon

Jasleen Royal: నా కల అంత ఈజీగా నెరవేరలేదు… వెనక్కి వెళ్లిపోదాం అనుకున్నా

Jasleen Royal Copy

Jasleen Royal Copy

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ అందుకున్న తొలి మహిళా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించింది పంజాబ్‌కు చెందిన జస్లీన్‌ రాయల్‌. సింగర్, సాంగ్‌ రైటర్, కంపోజర్‌గా సత్తా చాటుతోంది. పంజాబీ, హిందీ, గుజరాతీ, బెంగాలీతో పాటు ఇంగ్లీష్‌లోనూ పలు పాటలు పాడింది. జస్లీన్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకే టైమ్‌లో వివిధ రకాల మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ప్లే చేయడంలో జస్లీన్ దిట్టా. మరోవిశేషం ఏంటంటే సంగీతంలో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు జస్లీన్. ఆమె సెల్ఫ్‌–టాట్‌ ఆర్టిస్ట్‌.

హైస్కూల్‌ చదువు లుథియానాలో పూర్తి చేసిన జస్లీన్ పై చదువుల కోసం ఢిల్లీ వెళ్లింది. హిందూ కాలేజ్ లో బి.కామ్‌ పూర్తి చేసింది. పాకెట్ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పిల్లలకు సంగీత పాఠాలు చెప్పేది. ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ ఫస్ట్‌ సీజన్‌లో సెమీ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన ప్రతిభతో ‘వన్‌ ఉమెన్‌ బ్యాండ్‌’గా పేరు తెచ్చుకుంది. అయితే కెరీర్ స్టాటింగ్ లో అందరిలా తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపి ఈ టాలెంటెడ్ క్వీన్.

Also Read:  Indhuja Ravichandran: ఆ ముద్ర వేస్తారనే భయంతో అలా చేయడం లేదు!

బాలీవుడ్ కు రావాలన్నది తన చిన్నప్పటి కల అని అయితే అది అంత తేలికగా నెరవేరలేదని తెలిపింది. మన వల్ల కాదు వెనక్కి వెళ్లిపోదాం అనుకున్న సందర్భాలు తనకు కూడా చాలా ఉన్నాయని తెలిపింది. పరీక్షలు ఉన్నప్పుడు గట్టిగా నిలబడితే విజయం సొంతమవుతుందని, తన విషయంలో కూడా అదే జరిగిందంటూ జస్లీన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పలు రకాల ప్రాజెక్ట్ లతో జస్లీన్ ఫుల్ జోష్ లో ఉంది.