Site icon NTV Telugu

Japan 7.6 Earthquake: జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. వైరల్‌గా మారిన వీడియో

Earthquake

Earthquake

Japan 7.6 Earthquake: జపాన్ ఈశాన్య తీరంలో సోమవారం 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కేంద్రం అమోరి ప్రిఫెక్చర్ తీరానికి 80 కి.మీ దూరంలో, 50 కి.మీ లోతులో ఉంది. భూకంపం తర్వాత అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. అమోరి, హొక్కైడో తీరంలో భూకంపం సంభవించిందని, ఈశాన్య తీరంలో మూడు మీటర్ల (10 అడుగులు) ఎత్తు వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఈ భారీ భూకంపం కారణంగా ప్రాణనష్టం సంభవించినట్లు ఎక్కడ నివేదికలు లేవు.

READ ALSO: కొత్త ఫీచర్లు, 5500mAh రీప్లేసబుల్ బ్యాటరీ, ప్రైవసీ స్విచ్‌తో కొత్త Jolla Phone లాంచ్..!

ఈ భారీ భూకంపం కారణంగా ప్రమాదకరమైన సునామీ తరంగాలు జపాన్, రష్యా తీరాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (PTWC) పేర్కొంది. భూకంప కేంద్రం నుంచి 1,000 కి.మీ. పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా విధ్వంసకర అలలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హొక్కైడోకు చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఈ భారీ భూకంపం వీడియోను కూడా పంచుకున్నాడు.

జపాన్‌లో భూకంపాలు ఎందుకు వస్తాయి..
ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న ఈ ప్రాంతంలో భూమి టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొంటాయి. దీంతో ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయని పరిశోధకులు తెలిపారు. మార్చి 2011లో ఇదే ప్రాంతంలో వినాశకరమైన భూకంపం, సునామీ సంభవించి వేలాది మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో సంభవించిన భూకంపం కారణంగా జపాన్‌లో ఎటువంటి పెద్ద నష్టం జరగనప్పటికీ, అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలందరూ ఎత్తైన ప్రాంతాలకు వెళ్లి తీరప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు.

READ ALSO: Thailand: థాయిలాండ్‌‌కు వెళ్తున్నారా.. ఇవి లేకపోతే నో ఎంట్రీ జాగ్రత్త!

Exit mobile version