Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరికలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించిన వివరాల ప్రకారం, కుమామోటో (Kumamoto) ప్రిఫెక్చర్లో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం అనంతరం గరిష్టంగా ఒక మీటర్ (3.28 అడుగులు) ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
పలు ప్రిఫెక్చర్లకు అత్యవసర హెచ్చరికలు
భూకంపం నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం కుమామోటో, నాగసాకి, కగోషిమా, ఫుకుఓకా, సాగ, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్లలో అత్యవసర భూకంప హెచ్చరికలు జారీ చేసింది. ఇవన్నీ జపాన్ దక్షిణ భాగంలోని క్యూషూ (Kyushu) ద్వీపంలో ఉన్నాయి. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలు అధికారిక సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఇదిలా ఉండగా, అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ (PTWC) ఈ భూకంపం కారణంగా హవాయి, అమెరికన్ సమోవా ప్రాంతాలకు సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది.
Also Read
- Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్‌మన్‌తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
- Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
- Mega DSC: 'మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ'.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
అప్రమత్తంగా ఉండాలని సూచన
భూకంపం తర్వాత ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ అధికారులు సూచించారు. ప్రస్తుతానికి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు వెల్లడికాలేదు. పరిస్థితిపై అధికారులు నిరంతరం నిఘా ఉంచి, అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
- Tags
తాజావార్తలు
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరికలు జారీ
-
Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్‌మన్‌తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
-
Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
-
Supreme Court: విద్యార్థి నిరసనకారులకు ఊరట.. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!