Site icon NTV Telugu

Japan : రష్యాకు సహాయం చేస్తోందన్న ఆరోపణలతో భారత్ కంపెనీపై జపాన్ నిషేధం

New Project (12)

New Project (12)

రష్యాకు సహాయం చేసినందుకు గాను భారత టెక్నాలజీ కంపెనీతో సహా పలు దేశాలకు చెందిన 10 కంపెనీలపై జపాన్ నిషేధం విధించింది. పాశ్చాత్య దేశాలు, వారి మిత్రదేశాలు ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై కఠినమైన వాణిజ్య, ఆర్థిక ఆంక్షలు విధించాయి. వాణిజ్య ఆంక్షలను నివారించడానికి ఈ కంపెనీలు రష్యాకు సహాయపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్ల గురించి సమాచారం లేదు. జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కంపెనీలపై అసెట్ ఫ్రీజ్ మరియు ఎగుమతి నిషేధంతో సహా చర్యను ప్రకటించింది. ఈ కంపెనీలలో భారతదేశం, చైనా, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంపెనీలు ఉన్నాయి.

READ MORE: Game Changer : ఆ రెండు సినిమాల మధ్య గ్యాప్ లోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్..?

G-7లో ప్రకటించారు..
ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ ఫారిన్ ట్రేడ్ యాక్ట్ కింద జపాన్ ఈ చర్య తీసుకుందని జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి సహాయం చేస్తున్న కంపెనీలపై తమ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా గత వారం ఇటలీలో జరిగిన జి-7 సదస్సులో చెప్పారు.

Exit mobile version