Site icon NTV Telugu

Janvikapoor : మెగా హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్..

Jahnvi Kapoor

Jahnvi Kapoor

స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అదికూడా మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది..

గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా గేమ్ చేంజర్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. ఈ సినిమా చరణ్ కు బిగ్గెస్ట్ హిట్ ను ఇస్తుందని ఆయన అభిమానులు చెబుతున్నారు.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.

రామ్ చరణ్ చిత్రంలో జాన్వీ నటిస్తున్నట్లు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాగే ఈ చిత్రంలో సమంత నటించే సూచనలు కలవంటున్నారు. ఓ కీలక పాత్ర కోసం సమంతను సంప్రదించారట. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. నిజం ఏమిటనేది త్వరలో తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఆర్సీ 16ని నిర్మిస్తున్నారు.. త్వరలోనే హీరోయిన్ ఎవరనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది..

Exit mobile version