Jani Master Wife: ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. నా భర్తను వదిలేస్తా!
- జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ ఫిర్యాదు
- జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- మీడియాతో మాట్లాడిన జానీ సతీమణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా పేరు టాలీవుడ్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ అరెస్ట్ అనంతరం ఆయన సతీమణి సుమలత అలియాస్ ఆయేషా స్పందించారు. ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. తన భర్తను వదిలేస్తా అని సవాల్ చేశారు. తన భర్త ఎప్పుడూ ప్రతిభను ప్రోత్సహించేవారని చెప్పారు.
జానీ మాస్టర్ సతీమణి సుమలత మీడియాతో మాట్లాడుతూ… ‘టాప్ కొరియోగ్రాఫర్‌గా లేదా హీరోయిన్గా స్థిరపడాలనేది ఆ అమ్మాయి కోరిక. ఆమె తల్లి కూడా ఇదే కోరుకునేది. స్టేజ్ షోల నుంచి వచ్చిన ఆమె.. సినీ రంగాన్ని చూసి లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంది. ఎవరైనా తనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనుకునేది. మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యమేంటి?, నా భర్త జానీ మాస్టర్‌తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా?, ఇప్పటివరకూ ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా?, అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడటానికి ఏమైంది?’ అని ప్రశ్నించారు.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
‘ఆ అమ్మాయి లైంగిక వేధింపులకు గురైతే జానీ మాస్టర్ వద్ద పని చేయడం నా అదృష్టం అని నవ్వుతూ ఎందుకు చెబుతుంది. మాస్టర్ గురించి మాట్లాడినపుడు ఆమె ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. అసోషియేషన్ కార్డు పొందేందుకు ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేకపోతే మాస్టర్ ఇప్పించారు. మాస్టర్ తన సినిమాలలో కొరియోగ్రాఫర్‌గా కూడా అవకాశం ఇచ్చారు. నా భర్త ప్రతిభను ప్రోత్సహించేవారు. అలాంటి ఆయన ఎవరికైనా అవకాశాల్లేకుండా ఎందుకు చేస్తారు. ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా’ అని సుమలత అన్నారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!