Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలనచిత్ర పరిశ్రమలో అంతర్గత విభేదాలు, అవినీతి అక్రమాలు మరోసారి వీధిన పడ్డాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ డాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) మాజీ ప్రెసిడెంట్ జాని మాస్టర్ నేరుగా సినిమా నిర్మాతలకు రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారింది. డ్యాన్సర్స్ యూనియన్‌లో జరుగుతున్న భారీ అవినీతిని, దానికి ఫెడరేషన్ పెద్దలు అందిస్తున్న మద్దతును ఆయన ఈ లేఖ ద్వారా బట్టబయలు చేశారు. సినిమా కార్మికులకు అన్నం పెట్టేది నిర్మాతలేనని, వారిని తాము దైవ సమానులుగా భావిస్తామని లేఖలో పేర్కొన్న జానీ.. ప్రస్తుతం నిర్మాతలు ఎదుర్కొంటున్న కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీ, థియేటర్ల కొరత వంటి సమస్యలతో పాటు కొందరు స్వార్థపరుల అవినీతి వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. నిర్మాతలు కష్టపడి ఇస్తున్న డబ్బులు అసలైన డ్యాన్సర్లకు చేరకుండా మధ్యలో కొందరు దోచుకుంటున్నారని సంచలన నిజాలను బయటపెట్టారు.
యూనియన్‌లో జరుగుతున్న ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుత ప్రెసిడెంట్ వి.వి. సుమలతా దేవి చొరవతో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు జాని తెలిపారు.ప్రొడక్షన్ కంపెనీల పేరుతో నకిలీ (అక్రమ) బిల్లులు సృష్టించి అవినీతికి పాల్పడుతున్న కొందరు ప్రోగ్రామ్ ఇంచార్జ్‌లను సస్పెండ్ చేశారు. జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, అవినీతికి సహకరించిన జనరల్ సెక్రటరీని పదవి నుంచి శాశ్వతంగా తొలగించారు. అవినీతిపరులకు మద్దతుగా నిలిచిన కమిటీ సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. అయితే యూనియన్ బాగుకోసం అవినీతిపరులను ఏరివేస్తుంటే, ఫెడరేషన్ పెద్దలు మాత్రం ఆ అవినీతి తిమింగలాలకే కొమ్ముకాస్తున్నారని జాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మేము చర్యలు తీసుకుంటుంటే, ఫెడరేషన్ మా అసోసియేషన్‌కు అడ్డుపడుతున్నారు. అవినీతి చేసిన వారి తప్పులను కప్పిపుచ్చుతూ, వారిని మళ్లీ వెనకేసుకొస్తున్నారు” అని ఆరోపించారు. అంతేకాకుండా, మహిళ అయిన ప్రెసిడెంట్ సుమలతా దేవిపై ఫెడరేషన్ పెద్దలు తీవ్ర మానసిక ఒత్తిడి తీసుకువస్తున్నారని, పదవి నుండి తొలగించబడిన అవినీతిపరులను మళ్లీ చేర్చుకోవాలని బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మాట వినకపోతే అసోసియేషన్ గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు.
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్‌పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
జూలై 16న జరిగిన జనరల్ కౌన్సిల్ మీటింగ్‌లో కొందరు సభ్యులు ఫెడరేషన్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. “నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? తప్పు చేసిన వారిని ఎలా సమర్థిస్తారు?” అంటూ ఫెడరేషన్ ప్రతినిధులను నిలదీశారు. దీనికి ఫెడరేషన్ పెద్దలు సమాధానం చెప్పలేకపోయారని జాని తెలిపారు. ఫెడరేషన్ చేస్తున్న ఈ “నాటకీయ రాజకీయాలు” తక్షణమే ఆపాలని, డ్యాన్సర్ యూనియన్ అంతర్గత విషయంలో వారు జోక్యం చేసుకోకుండా చూడాలని జానీ తెలుగు సినిమా నిర్మాతలను, ఇండస్ట్రీ పెద్దలను వేడుకున్నారు. అవినీతిని అంతం చేసి, నిర్మాతలకు న్యాయం జరిగేలా చూడటం తమ లక్ష్యమని, ఈ పోరాటంలో నిర్మాతలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
Every producer who thrives gives ten families a livelihood. My open letter to the Telugu film industry.
Our Dancers’ Union acted against corruption within our ranks and instead of support, we’ve faced pressure to protect the guilty.
Standing firm for what’s right. 🙏 #TFTDDA pic.twitter.com/POOoBgd3nq
— Jani Master (@AlwaysJani) July 18, 2026
తాజావార్తలు
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!