Janhvi kapoor: నటితో కలిసి చెన్నైలో గుడికెళ్లిన జాన్వీ కపూర్.. శ్రీదేవి ఫేవరెట్ ప్లేస్ అంటూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi kapoor Visited Sridevi’s Favourite Temple: నటిగా భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండే అతి తక్కువ మంది నటీమణులలో శ్రీదేవి ఒకరు. ఆమె అనూహ్య మరణం పలువురిని కలచివేసింది. నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతుండగా, నిన్న చెన్నైలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు చిత్ర కథానాయకుడు రాజ్‌కుమార్‌రావు, జాన్వీ కపూర్‌లు హాజరయ్యారు. వీరిద్దరూ షారుక్ ఖాన్ కోల్‌కతా జట్టుకు మద్దతుగా నిలిచారు. ఆట ముగిసే సమయానికి కోల్‌కతా IPL 2024 ట్రోఫీని గెలుచుకుంది. దాని వేడుకలు పూర్తయ్యాయి.
Shah Rukh Khan: షారుఖ్ వాచ్ ధరతో హైదరాబాద్లో లగ్జరీ విల్లా కొనచ్చు తెలుసా?
Also Read
ఇక ఇదిలా ఉండగా నటి జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చెన్నైలోని ప్రసిద్ధ ముప్పట్టమ్మన్ ఆలయాన్ని సందర్శించిన ఫోటోను షేర్ చేసింది. జాన్వీ కపూర్‌తో పాటు ఆ ఆలయానికి ప్రముఖ నటి మహేశ్వరి కూడా వెళ్లింది. నటి మహేశ్వరి నటి జాన్వీ కపూర్‌కు సోదరి వరుస అవడం గమనార్హం. దేవర: పార్ట్ 1తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దేవర చిత్రం యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే రెండో పాట విడుదల కానుంది. ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తరువాత ఆమె బుచ్చిబాబు సినిమాలో కూడా నటిస్తోంది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!