NTV Telugu Site icon

RC16 Shooting : రామ్ చరణ్, జాన్వీల ‘RC16’ షూటింగ్ అప్పటి నుంచేనా ?

New Project 2024 11 05t075156.678

New Project 2024 11 05t075156.678

RC16 Shooting : అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఇప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు స్టార్ హోదా తీసుకురాలేకపోయాయి. కాబట్టి తెలుగులో లక్ పరిశీలించుకోవాలని ప్రయత్నాలు చేసి ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే దేవర ఫస్ట్ పార్టులో ఎక్కువసేపు ఆమె కనిపించలేదని కంప్లైంట్స్ ఉన్నాయి. కనిపించింది కొంచెం సేపు అయినా ఆమె హీరోయిన్ లాగా అనిపించలేదని రకరకాల కామెంట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె అభిమానులు స్థిమితపడేలా ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేంటంటే ఆమె రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రాంచరణ్ 16వ సినిమాలో కూడా నటిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read Also:Astrology: నవంబర్‌ 5, మంగళవారం దినఫలాలు

సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ మైసూర్ లో నవంబర్ 22నుంచి జరగబోతోంది. తర్వాత హైదరాబాద్ నగరానికి షిఫ్ట్ కాబోతోంది. ఇక రామ్ చరణ్ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తన బాడీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. టీం కూడా ఇప్పటికే మిగతా నటీనటులను అందరినీ ఫైనలైజ్ చేశారు. అయితే సెకండ్ హీరోయిన్ గా మరొక బాలీవుడ్ హీరోయిన్ ని దింపే ప్రణాళికలు ఉన్నాయని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో కేవలం ఒకే హీరోయిన్ మాత్రమే ఉంటుందని అది కూడా జాన్వీ కపూర్ మాత్రమేనని తెలుస్తోంది.

Read Also:Actress Kasturi : తెలుగు రాజకీయాల్లోకి నటి కస్తూరి.. ఏ పార్టీ అంటే..?

ఈ సినిమాలో మరే ఇతర హీరోయిన్లు ఉండబోరు అని తెలుస్తోంది. ఒకరకంగా ఇది జాన్వీ కపూర్ కు మాత్రమే కాదు ఆమె అభిమానులకు కూడా ఓ శుభవార్త లాంటిదే అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారట. ఈ సినిమా ఇంటర్వెల్ లోనే చరణ్ రెండో పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందట. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. అన్నట్టు యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

Show comments