NTV Telugu Site icon

Janhvi Kapoor-Radhika Merchant: అందుకే రాధిక మర్చంట్‌కు పార్టీ ఇచ్చా.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Janhvi Kapoor

Janhvi Kapoor

Janhvi Kapoor React on Party With Radhika Merchant: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం ఇటీవలే ముగిసింది. విదేశీ ప్రముఖుల రాక, బాలీవుడ్‌ స్టార్ల ఆటపాటలతో మూడు రోజుల పాటు వెడ్డింగ్‌ ఓ రేంజ్‌లో జరిగింది. అనంత్-రాధికల పెళ్లికి దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా నిలిచింది. గత కొన్ని నెలలుగా అంబానీ పెళ్లి గురించే దేశమంతా చర్చించుకుంటోంది. అయితే పెళ్లికి ముందు రాధిక ప్రియమైన స్నేహితురాలు అయిన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఓ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ ఎందుకు ఇచ్చారో జాన్వీ తాజాగా తెలిపారు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధిక మర్చంట్‌ కోసం పార్టీ ఇవ్వడంపై జాన్వీ కపూర్ స్పందించారు. ‘రాధిక నాకు మంచి స్నేహితురాలు. తను మాతో చాలా సరదాగా ఉంటుంది. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే వివాహానికి ముందు రాధిక కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటుచేయాలని మా ఫ్రెండ్స్‌ అందరం అనుకున్నాం. ముందుగానే ప్లాన్‌ చేసి పార్టీ ఇచ్చాం. రాధిక చాలా సంతోషించింది. అందరం బాగా ఎంజాయ్ చేశాం. ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉండాలి’ అని జాన్వీ చెప్పారు.

Also Read: Sairaj Bahutule Stats: టీమిండియా కోచ్‌గా బాధ్యతలు.. ఎవరీ సాయిరాజ్ బహుతులే?

జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘ఉలఝ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా ఈ సినిమాను తెరకెక్కించారు. జంగ్లీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. ఇందులో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారిణిగా జాన్వీ కనిపించనున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఉలఝ్‌ చిత్రంలో గుల్షన్‌ దేవయ్య, రాజేశ్‌ థైలాంగ్‌ కీలక పాత్రలు పోషించారు. ఆగష్టు 2న ఈ సినిమా రిలీజ్ కానుంది.

 

 

Show comments