Janhvi Kapoor-Radhika Merchant: అందుకే రాధిక మర్చంట్‌కు పార్టీ ఇచ్చా.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor React on Party With Radhika Merchant: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం ఇటీవలే ముగిసింది. విదేశీ ప్రముఖుల రాక, బాలీవుడ్ స్టార్ల ఆటపాటలతో మూడు రోజుల పాటు వెడ్డింగ్ ఓ రేంజ్‌లో జరిగింది. అనంత్-రాధికల పెళ్లికి దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా నిలిచింది. గత కొన్ని నెలలుగా అంబానీ పెళ్లి గురించే దేశమంతా చర్చించుకుంటోంది. అయితే పెళ్లికి ముందు రాధిక ప్రియమైన స్నేహితురాలు అయిన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఓ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ ఎందుకు ఇచ్చారో జాన్వీ తాజాగా తెలిపారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధిక మర్చంట్ కోసం పార్టీ ఇవ్వడంపై జాన్వీ కపూర్ స్పందించారు. ‘రాధిక నాకు మంచి స్నేహితురాలు. తను మాతో చాలా సరదాగా ఉంటుంది. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే వివాహానికి ముందు రాధిక కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటుచేయాలని మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం. ముందుగానే ప్లాన్ చేసి పార్టీ ఇచ్చాం. రాధిక చాలా సంతోషించింది. అందరం బాగా ఎంజాయ్ చేశాం. ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉండాలి’ అని జాన్వీ చెప్పారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Sairaj Bahutule Stats: టీమిండియా కోచ్‌గా బాధ్యతలు.. ఎవరీ సాయిరాజ్ బహుతులే?
జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘ఉలఝ్’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా ఈ సినిమాను తెరకెక్కించారు. జంగ్లీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిణిగా జాన్వీ కనిపించనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఉలఝ్ చిత్రంలో గుల్షన్ దేవయ్య, రాజేశ్ థైలాంగ్ కీలక పాత్రలు పోషించారు. ఆగష్టు 2న ఈ సినిమా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..