Janhvi Kapoor :నీ గొంతు, నీ స్పర్శే నా బలం.. శ్రీదేవి వర్ధంతి వేళ జాన్వీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi). భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా, ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ సజీవమే. భారతీయ చలనచిత్ర చరిత్రలో శ్రీదేవి పేరు ఒక ధ్రువతార. కేవలం ఒక నటిగా మాత్రమే కాకుండా, దేశం గర్వించదగ్గ మొదటి ‘ఫీమేల్ సూపర్ స్టార్’గా ఆమె ఎదిగిన తీరు అమోఘం. కేవలం నాలుగు ఏళ్ళ వయసులో బాలనటిగా కెరీర్ ప్రారంభించి.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తనదైన ముద్ర వేశారు.
Also Read : The Paradise: ‘ఆయా షేర్’ నెగిటివ్ ప్రచారంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
అలా దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో దాదాపు 300 చిత్రాల్లో నటించి, భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్న ఈ నట దిగ్గజం, నేటికీ ఎంతో మంది నటీమణులకు స్ఫూర్తిప్రదాత. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె పోషించిన పాత్రలు, ఆ చిలిపి నవ్వు వెండితెరపై ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అయితే.. ఫిబ్రవరి 24న ఆమె వర్ధంతి సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెను తలచుకుంటున్నారు.
ఈ క్రమంలో శ్రీదేవి గారాల పట్టి, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన తల్లిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ నోట్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్,ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన చిన్నప్పుడు తల్లితో కలిసి ఉన్న ఒక మధురమైన ఫోటోను పంచుకుంది..‘అమ్మా.. నిన్ను తలచుకోని రోజు ఒక్కటి కూడా గడవదు. నీ గొంతు, నీ కౌగిలి, నీ ధైర్యం.. ఇవే నన్ను ఇప్పటికీ ప్రతి రోజూ నడిపిస్తున్నాయి. నువ్వు ఎక్కడున్నా సరే, నేను నిన్ను గర్వపడేలా చేస్తానని భావిస్తున్నాను. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నాను. ఎప్పటికీ నీ చిన్న పాపనే’ అంటూ రాసుకొచ్చింది.
Amma… 🤍
Not a single day passes without thinking of you.
Your voice, your hugs, your strength, they still guide me every day. I hope I’m making you proud wherever you are.
Miss you more than words can ever say,Forever your little girl 🌸✨
Miss You Mumma🥹❤️#Sridevi pic.twitter.com/tPsvW4YFU1— Jahnavi Kapoor (@JahnviKapoor_FC) February 24, 2026
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!