NTV Telugu Site icon

Janhvi Kapoor : వేడుకలో జిప్ చిరిగిపోయి ఇబ్బందిపడ్డారట జాన్వీ

Janhvi

Janhvi

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఆర్ఆర్ఆర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ఎన్టీఆర్30లో ఛాన్స్ కొట్టేసిన భామ కూడా రీసెంట్ గా షూటింగ్ లో పాల్గొంది. కాగా, 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం గురువారం రాత్రి ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో వైలెట్ కలర్ గౌనులో దేవదూతలా కనిపించింది. జాన్వీ తన స్టేజ్ పెర్ఫార్మెన్స్‌తో కూడా ఆకట్టుకుంది. అదే సమయంలో, ఆమె ధరించిన దుస్తుల జిప్ చిరిగిపోయిందని అందుకు సంబంధిత చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలో ప్రదర్శనకు ముందు జాన్వీ తాను ఇబ్బంది పడ్డానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది. తన డ్రెస్ జిప్ రెండుసార్లు చిరిగిపోయిందని వెల్లడించింది. ఆ డ్రెస్ తో రెడ్ కార్పెట్ పై నడిచే 5 నిమిషాల ముందు జిప్ చిరిగిపోయిందని, ఆ తరువాత స్టేజి పై పెర్ఫామెన్స్ ఇచ్చే 12 నిమిషాల ముందు జిప్ మళ్ళీ చిరిగినట్లు జాన్వీ తెలియజేసింది. ఈ విషయాన్ని చెప్పుకొస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలో జాన్వి కారులో కూర్చొని ఉంటే టైలర్ వెనుక నుంచి ఆ జిప్ ని కుడుతూ ఉండడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also: Telugu Sangamam: కాశీలో తెలుగు భక్తుల సంగమం.. ప్రసంగించనున్న ప్రధాని

ఇదిలా ఉంటే, ‘మిలి’ చిత్రంలో తన నటనకు గాను జాన్వీ ఈ సంవత్సరం ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి (మహిళ) విభాగంలో నామినేట్ చేయబడింది. కానీ సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’లో తన నటనకు అలియా భట్ ఈ అవార్డును గెలుచుకుంది. గతంలో కూడా 2020లో ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమా కోసం జాన్వీ ఫిల్మ్‌ఫేర్‌కు నామినేట్ కావడం.. ఇది రెండోసారి.

గతేడాది ‘గుడ్ లక్ జెర్రీ, మైలీ’ సినిమాల్లో కనిపించిన జాన్వీ ఇప్పుడు ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’లో క్రికెటర్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె రాజ్‌కుమార్‌రావుతో జతకట్టనుంది. ఆమె నితేష్ తివారీ ‘బావల్’లో వరుణ్ ధావన్ సరసన కూడా నటిస్తోంది. కాగా, కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారు.