Site icon NTV Telugu

Janga Krishna Murthy Quits YSRCP: వైసీపీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గుడ్‌బై.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

Janga Krishna Murthy

Janga Krishna Murthy

Janga Krishna Murthy Quits YSRCP: ఎన్నికల తరుణంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. ఈసారి టకెట్‌ లేదన్న సంకేతాలతో.. జాబితా విడుదల కాకముందే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు.. ఇలా పార్టీకి రాజీనామాలు చేయగా.. ఇప్పుడు.. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా అదే బాటలో నడిచారు.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేశాను.. కానీ, నా విధేయతను పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కాసు మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాను.. కానీ, ఈరోజు గురజాలలో మళ్లీ మహేష్‌రెడ్డికి సీట్ ఇచ్చారని మండిపడ్డారు.

Read Also: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఇలా ఆడుతాడని అస్సలు ఊహించలేదు!

వైసీపీ అధిష్టానం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయలేకపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు జంగా కృష్ణమూర్తి.. అందుకే అలాంటి పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం టీడీపీలోకి వెళ్తున్నానని ప్రకటించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గామాలపాడులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీని వీడాల్సి వస్తుంది.. పార్టీని వీడడం ఎంతో బాధాకరంగా కూడా ఉందని అన్నారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, బీసీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం, భవిష్యత్ కోసం.. తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టు ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి వెల్లడించారు. కాగా, ఆదివారం రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి సమావేశమైన విషయం విదితమే.. ఈ భేటీలో తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించారట.. అయితే, జంగా కృష్ణమూర్తి రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు హామీ ఇచ్చారని, దీంతో ఆయన వైసీపీలో ఇమడలేని పరిస్థితుల్లో.. ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

Exit mobile version