NTV Telugu Site icon

Janga Krishna Murthy: వైసీపీకి షాక్.. నేడు పార్టీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా..!

Janga Krishna Murthy

Janga Krishna Murthy

Janga Krishna Murthy: ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా సీట్లకు ముడిపడి.. నేతల వలసలు కొనసాగుతున్నాయి.. ఇప్పుడు.. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి.. తన సొంత గ్రామం గామాలపాడులో వైసీపీకి రాజీనామా అంశాన్ని ప్రకటించేందుకు జంగా కృష్ణమూర్తి సిద్ధమైనట్లు తెలుస్తోంది.. నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో బాపట్లలో సమావేశం అయ్యారు జంగా కృష్ణమూర్తి.. ఈ భేటీలో తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై చర్చించినట్లు తెలుస్తోంది.. అయితే, జంగా కృష్ణమూర్తి రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు హామీ ఇచ్చారని, దీంతో ఆయన వైసీపీలో ఇమడలేని పరిస్థితుల్లో.. టీడీపీలోకి వెళ్తున్నారని ఆయన అనుచర వర్గం చెబుతుంది.. మొత్తంగా గత కొంతకాలంగా అధికార పార్టీకి దూరమవుతూ వస్తున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈ రోజు వైసీపీకి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. అయితే, గురజాల టికెట్ విషయంలో గత కొద్ది రోజులుగా అధికార వైసీపీకి దూరమయ్యారు జంగా కృష్ణమూర్తి.. మరోవైపు ఇప్పుడు టీడీపీలోనూ జంగాకు సీటు దక్కే అవకాశం లేదు.. అయినప్పటికీ ఆయన టీడీపీలోకి వెళ్లేందుకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.. నేడు గురజాల నియోజకవర్గంలోని తన సొంత గ్రామం గామాలపాడులో కార్యకర్తల సమక్షంలో వైసీపీకి రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉంది.

Read Also: Chiranjeevi : ఆ ఘటన నన్ను భాధించింది..ఈరోజుకి కూడా అక్కడికి వెళ్లలేదు..