NTV Telugu Site icon

Pawan Kalyan : పవన్ కల్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ లో మార్పులు

Pawan

Pawan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం కాకినాడ నుంచి ముమ్మిడివరం వెళ్లనున్నారు. జూన్21న ముమ్మిడివరంలో పవన్ ఉదయం జనవాణి, సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక, జూన్22న పవన్ కళ్యాణ్ అమలాపురంలో జనవాణి ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొననున్నారు. జూన్23న అమలాపురంలో వారాహి బహిరంగ సభ ఉంటుంది. అలాగే, జూన్24, జూన్25న పి గన్నవరం, రాజోలులో పవన్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. జూన్ 25న రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేన పార్టీ బహిరంగ సభ జరుగనుంది.

Read Also: Manikrao Thakre : మాణిక్‌ రావు థాక్రే తో విష్ణు భేటీ.. గ్రేటర్ రాజకీయంపై చర్చ

ఇక పవన్ కల్యా్ణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ముఖ్యమంత్రి జగన్ అండ చూసుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని పవన్ మండిపడ్డారు. ఎమ్మెల్యే తీరు చూస్తుంటే గోదావరి జిల్లాలకు ముఖ్యమంత్రి ఆయనే అన్నట్టు ఉందని జనసేనాని వ్యాఖ్యానించారు. నీ పతనం మొదలైంది.నీ సామ్రాజ్యం కూలదోయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. నా పార్టీ జనసేన కాదు అంటూ తీవ్ర స్వరంతో వార్నింగ్ ఇచ్చాడు. మీ తాతకు బేడీలు వేసి లక్కేళ్ళినట్లు నీకు కూడా రాబోయే రోజుల్లో భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటూ పవన్ కల్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Vaani Kapoor Hotness Alert: హాట్ ట్రీట్ ఇచ్చిన వాణి కపూర్.. బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ పోజులు!

జనసేనాని చీఫ్ చేసిన కామెంట్లపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ అనే వాడు నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టలేక రూరల్ లో మీటింగ్ పెట్టాడు అని ఆయన అన్నారు. రాజకీయ వ్యభిచారి మాటలకి నేను స్పందించాలి.. అస్సలు జనసేన పార్టీని ఎవరిని ఉద్ధరించడానికి పెట్టాడు అని పవన్ కల్యాణ్ ను ద్వారంపుడి ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ ను నమ్మి వచ్చిన వారు ఎవరు ఉన్నారు.. నన్ను నమ్మిన వారు నాతోనే ఉన్నారు అని ఆయన అన్నారు.
ప్యాకేజీ , సీట్లు బేరం కుదరక పోవడంతో రోడ్డు మీదకి వచ్చి నన్ను సీఎం చేయండి అని పవన్ కల్యాణ్ అంటున్నాడని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

Show comments