Pawan Kalyan: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా లోకానికి శుభాకాంక్షలు చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రానున్న తమ ప్రభుత్వంలో మహిళల సంక్షేమం కోసం చేపట్టే పథకాలను కూడా వివరించారు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుతూ ఓ ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్.. మహిళా సంక్షేమం చేపట్టడం రాబోతున్న మా ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత. నా అక్కలు నా చెల్లెమ్మలు.. అని నాలుక చివరి మాటలతో సరిపుచ్చం. మహిళలు విద్య, ఉద్యోగాల్లో రాణించేలా చేస్తాం.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేలా చేస్తాం.. ప్రతి ఆడపడుచుకీ రక్షణ ఇవ్వడం, వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. మహిళల రక్షణ.. సంక్షేమం మా బాధ్యతగా పేర్కొన్నారు.
Read Also: Soldiers : బోర్డర్ లో ఏమౌతోంది.. 10వేల మంది సైనికులకు మోహరించిన భారత్
నవతరం యువత తరచూ మల్టీ టాస్కింగ్ అంటూ ఉంటుంది. మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లినే కాదు.. ఏ మహిళామణిని చూసినా మల్టీ టాస్కింగ్ అంటే ఏమిటో తెలుస్తుందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. ఇంటిని చక్కదిద్దుతూ, బిడ్డల ఆలనాపాలన చూస్తూనే – ఉద్యోగ విధుల్లో, తాము ఎంచుకున్న రంగాల్లో అతివలు రాణిస్తున్నారని ప్రశంసించారు. ఎందరో, వారి స్ఫూర్తితో ముందడుగు వేస్తున్న ఈతరం అడబిడ్డలు మరెందరో ఉన్నారు. ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆకాశమే హద్దుగా దూసుకువెళ్లగల సత్తా వీరి సొంతం. మహిళలని మనం ప్రోత్సాహించాలి అని తన ప్రకటనలో రాసుకొచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.