Arava Sridhar Case: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వీణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై రైల్వేకోడూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు క్వాష్ చేయాలని శ్రీధర్ పిటిషన్ వేశారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని.. ఎలాంటి ఆధారాలు లేని దురుద్దేశంతో పెట్టిన కేసు నుంచి ఉపశమనం కల్పించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీఎన్‌ఎస్ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసులకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం ఏకపక్ష అరెస్టులను కష్టతరం చేస్తుంది. అరెస్ట్ ఆవశ్యకతను సమర్థిస్తూ పోలీసు అధికారి వ్రాతపూర్వక కారణాలను నమోదు చేస్తే తప్ప అరెస్టు చేయలేరు. ఒక వేళ అరెస్ట్ చేస్తే చట్టబద్ధంగా సవాలు చేస్తుంది.
READ MORE: RCB vs DC Women Final: వడోదరలో 160+ టార్గెట్ ఛేజ్ అంటే అసాధ్యమే.. కప్ ఢిల్లీ క్యాపిటల్స్‌దే?
ఇదిలా ఉండగా.. లైంగిక దాడి, మోసం ఆరోపణల నేపథ్యంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను జనసేన త్రిసభ్య కమిటీ మొన్న (మంగళవారం) సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు కోడూరుకు వచ్చిన కమిటీ సభ్యులు రమాదేవి, శివశంకర్, వరుణ్.. నేరుగా స్థానిక రాజ్ రెసిడెన్సీలో ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు విచారణ కొనసాగింది. బాధితురాలు చేసిన ఆరోపణలు, వాట్సప్ చాటింగ్ వ్యవహారం, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై అరవ శ్రీధర్‌ను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన వాదనను కమిటీ ముందు సవివరంగా వినిపించారు. ఎమ్మెల్యేనే కాకుండా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సుమారు 40 మంది ఎంపిక చేసిన నాయకులు, కార్యకర్తలను కూడా కమిటీ పిలిపించి విచారించింది. ఎమ్మెల్యే ప్రవర్తన, తాజా పరిణామాలపై వారి నుంచి సమాచారం సేకరించింది. సాయంత్రం మరోసారి ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడారు. ఈ అంశంపై సుదీర్ఘంగా విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
READ MORE:Chahal: “భారత్‌ను ఓడించే సత్తా వారికి మాత్రమే ఉంది”.. టీ20 వరల్డ్ కప్‌పై చహల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
