NTV Telugu Site icon

Janasena: కాపు నేతలు, వ్యాపారవేత్తలతో నాగబాబు రహస్య భేటీ..!

Nagababu

Nagababu

Janasena: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు హీట్‌ పెంచుతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు టార్గెట్‌గా ఎవరి వ్యూహాలకు వారు పదునుపెడుతున్నారు. సభలు, సమావేశాలు, రహస్య భేటీలు ఇలా ముందుకు సాగుతున్నారు నేతలు.. ఇక, తాజాగా మెగా బ్రదర్‌, జనసేన నేత నాగబాబు కాపు నేతలు, వ్యాపార ప్రముఖులతో రహస్యంగా సమావేశం అయ్యారట.. విశాఖలోని బీచ్‌ రోడ్డులో ఉన్న ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ రహస్య సమావేశంలో కీలక అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఈ సమావేశంలో పాల్గొన్నవారికి సెల్ ఫోన్లకు కూడా అనుమతి ఇవ్వకుండా జాగ్రత్త వహించారట నిర్వాహకులు.. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ గెలుపే ప్రధానంగా పనిచేయాలని నిర్ణయించారట..

Read Also: Isro Chief Somanath: నేడు జేఎన్టీయూ స్నాతకోత్సవం.. ఇస్రో చీఫ్ కు డాక్టరేట్ ప్రదానం

ఇదే సమయంలో.. ముఖ్యమంత్రి పదవిపై నారా లోకేష్ వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.. పదవులపై పవన్ కల్యాణ్‌, చంద్రబాబు నిర్ణయమే ఫైనల్.. తప్ప మిగిలిన నాయకులను పరిగణలోకి తీసుకోవద్దని స్పష్టం చేశారట నాగబాబు.. రెండు సామాజిక వర్గాలకే ఇంత కాలం అవకాశం లభించినందున ఇప్పుడు మార్పు రావాల్సిందేనని తీర్మానం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.. అభ్యర్థి ఎవరనే దాని కంటే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ విజయం లక్ష్యంగా పని చేయాలని కాపు నేతలకు, వ్యాపారప్రముఖులను నాగబాబు కోరినట్టుగా తెలుస్తోంది. కాగా, వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి.. ఉమ్మడి కార్యాచరణతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, బీజేపీతో పొత్తు వ్యవహారం తెలాల్సి ఉండగా.. ఇప్పుడు ఏపీలో మారిన రాజకీయ పరిణాలు ఇంకా ఎలాంటి మలుపు తీసుకుంటాయి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.