NTV Telugu Site icon

Janasena: రెండు ఓట్ల వివాదంలో నాగబాబు.. తెలంగాణలో ఓటేసి, ఏపీలో మళ్లీ వేస్తారా?

Nagababu

Nagababu

Janasena: రెండు ఓట్ల వివాదంలో జనసేన నేత నాగబాబు చిక్కుకున్నారు. ఇటీవల తెలంగాణలో నాగబాబు కుటుంబం ఓటు వేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఇటీవల నాగబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఏపీలో ఓటు కోసం నాగబాబు కుటుంబం దరఖాస్తు చేసింది. ప్రస్తుతం నాగబాబు ఓటర్‌ అప్లికేషన్‌ సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఈ దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. వైసీపీ శ్రేణులు జనసేనపై విమర్శలు సంధిస్తున్నాయి.

Read Also: Minister Kakani Govardhan Reddy: జగన్ ఇచ్చిన ప్రతీ హమీని అమలు చేస్తున్నారు..

వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ఓటు కోసం నాగబాబు ఫ్యామిలీ దరఖాస్తు చేయగా.. ఒక ఓటు ఉండగా రెండో ఓటు కోసం దరఖాస్తు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగబాబు రెండో ఓటు అంశంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా చేయడం ఏమిటంటూ మండిపడుతున్నారు. తెలంగాణలో ఓటు వినియోగించుకున్న నాగబాబు.. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఓటు వేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది.

Read Also: Bhogapuram Green Field Airport: 2025లో అందుబాటులోకి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌!

ఓటు హక్కు అనేది ఒకే చోట ఉంటుంది. జనసేన నేత నాగబాబుకు కూడా ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. అయితే, తెలంగాణలో లేదంటే.. ఏపీలో ఈ హక్కు ఉండాలి. రెండు చోట్ల ఉండే అవకాశం లేదు. అందుకే ఓటు మార్చుకున్నప్పుడు కొత్త చోట అవకాశం కల్పిస్తూ.. గతంలో ఉన్న చోట ఆ హక్కును తొలగిస్తారు. నాగబాబు ఏపీలో ఓటు హక్కుకు దరఖాస్తు చేయగానే.. బూత్ లెవల్ ఆఫీసర్ విచారణ చేశారు. నాగబాబు దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు అధికారులు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉన్నట్టు తెలిసింది. దీంతో పక్కింటి వారికి సమాచారం ఇచ్చారు. నాగబాబు తమ ముందు హాజరు కావాలని పేర్కొన్నారు.