Site icon NTV Telugu

Janasena Wedding Card: అభిమాని వినూత్న ప్రచారం.. పెళ్లికార్డుపై జనసేన మేనిఫెస్టో..!

7

7

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంతో రాజకీయ కొలహలం సాగుతోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ వాతావరణం మరింత వేడిగా మారింది. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే.. ఓ వ్యక్తి తన పెళ్లి శుభలేఖ కార్డుపై జనసేన పార్టీ పై ఉన్న తన అభిమానాన్ని చాటుతూ జనసేన పార్టీ మేనిఫెస్టోను ముద్రించాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Samyuktha Menon: ఆరేంజ్ కలర్ డ్రెస్సులో అదరగొడుతున్న సంయుక్త..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా., పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వర్గం నుండి పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా తన అభిమాని ఆయన వివాహ కార్డు పై జనసేన మేనిఫెస్టోను ముద్రించాడు. పిఠాపురంలో తన పెళ్లి కార్డు బంధువులకు అందించి ఆపై పార్లమెంటు ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాడు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండవరం గ్రామానికి చెందిన వీరబాబుకు రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది.

Also Read: PM Modi: యుపి ర్యాలీలో “ఫ్లాప్ ఫిల్మ్” అంటూ వారి పై వ్యాఖ్యలు చేసిన పీఎం మోడీ..!

ఇకపోతే ఈ పెళ్లికి సంబంధించిన కార్డులో జనసేన మేనిఫెస్టో ముద్రించడం అన్న విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఎన్నికల్లో నేపథంగా పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఏప్రిల్ 7న అనకాపల్లిలో, ఏప్రిల్ 8న ఎలమంచిలో, ఏప్రిల్ 9న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొనబోతున్నాడు. తీవ్ర జ్వరం నుంచి కోలుకున్న ఆయన రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలో వారాహి యాత్రను కొనసాగించమన్నాడు.

Exit mobile version